పెద్దలు రోజుకో యాపిల్ తింటే చాలు... డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతారు. కానీ ఇప్పుడు యాపిల్ తింటే మాత్రం రోగాలను కొని తెచ్చుకున్నట్టే అని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా యాపిల్స్ తినడం వలన యాపిల్స్ లో ఉండే ఫైబర్, ప్లేవనాయిడ్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. యాపిల్స్ లో పుష్కలంగా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. యాపిల్ పండ్లు శరీరానికి నిజంగా మంచివే. కానీ యాపిల్ పండ్లను పెంచే పద్ధతిపై ఆ పండ్లు మంచివో కాదో ఆధారపడి ఉంటుంది. 
 
ఈ మధ్య కాలంలో ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన పరిశోధకులు తమ పరిశోధనల్లో ఆర్గానిక్ యాపిల్ పండ్లలో దాదాపు 100 మిలియన్ల బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. శరీర సామర్థ్యాన్ని ఈ బ్యాక్టీరియా దెబ్బ తీస్తుందని పరిశోధనలో తేలింది. యాపిల్ తాజాగా ఉండటం కొరకు వ్యాపారులు వాడే కృత్రిమ సాధనాల వలన కూడా బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
శాస్త్రవేత్తలు యాపిల్ కు ఫంగస్ వ్యాప్తి చేసే గుణం ఎక్కువగా ఉందని కూడా నిర్ధారణ అయినట్లు చెబుతున్నారు. పరిశోధకులు ఒక యాపిల్ ను తింటే 10 కోట్ల బ్యాక్టీరియా తిన్నట్టే అని చెబుతున్నారు. పరిశోధకులు యాపిల్ ను ఎక్కడ సాగు చేశారు.. ఏ వాతావరణ పరిస్థితుల్లో సాగు చేశారు అనే విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు. 
 
యాపిల్స్ లో ఎక్కువ బ్యాక్టీరియా గింజల్లో ఉంటుంది. యాపిల్స్ తినే సమయంలో గింజలు తీసేసి గింజల చుట్టూ ఉన్న గుజ్జు కూడా తీసేసి తింటే కొన్ని కోట్ల బ్యాక్టీరియాను వదిలించుకున్నట్లే అని చెప్పవచ్చు. ఈ బ్యాక్టీరియా కడుపులో పేరుకుపోతే మాత్రం కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: