మనం సాధారణంగా కుక్కని ఒక విశ్వాసానికి చిహ్నంగా ఉపయోగిస్తాము అలాగే మన ఇంటి సభ్యులలో ఒకటి గా ఎప్పుడో మారిపోయంది అలంటి  కుక్క ఇప్పుడు మన ప్రాణాలు కాపాడడానికి మరో అడుగు ముందుకేసింది. అదేంటంటే  మనుషులు అవసరాన్ని బట్టి వేరే మనిషికి రక్తాన్ని దానంగా ఇవ్వొచ్చు అదే విదంగా ఎలాంటి  రక్త బదిలీ   కుక్కల్లో, పిల్లుల్లోనూ చేయొచ్చంట. ఈ విషయం తెలియక జంతు ప్రేమికులు ఎందరో వారి కుక్కలు, పిల్లుల ప్రాణాలు కోల్పోతున్నారు.

 

అనీమియా లాంటి వ్యాధులు పిల్లుల్లో కుక్కల్లో సాధారణంగా వచ్చే వ్యాధి ఈ వ్యాధి సోకినప్పుడు రక్త మార్పిడి అవసరం అవుతుంది అప్పుడు రక్తం దొరకక జీవులు చనిపోతాయి అదే విదంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు తీవ్ర గాయాలకు గురైన  పెంపుడు జంతువులు కూడా  చనిపోతుంటాయి. అయితే జంతు ప్రేమికుడైన ఒక వెటర్నరీ వైద్యుడు మనుషులకు రక్తం గ్రూప్ లు రక్త మార్పిడి ఉన్నప్పుడు జంతువుల్లో అది సాధ్యం కదా అని ఆకోచించి దీనిపైనా పరిశోధన మొదలు పెట్టాడు అయన కనుగొన్న విష్యం ఏమిటంటే  నిజానికి కుక్కలు, పిల్లులు కూడా రక్తదానం చేయొచ్చని  డా.కరెన్ హమ్ , రాయల్ వెటర్నర్ కాలేజీ, యూకే వెల్లడించారు.

 

మనుషులకు ఉన్నట్లుగానే జంతువుల్లోనూ రక్తం  గ్రూపులు ఉంటాయని  పైగా వీటి నుంచి రక్తం తీసుకోవాల్సి వచ్చినప్పుడు  వెటర్నరీ డాక్టర్ సాయంతో వాటి గ్రూపు లకు  అనుకూలంగా రక్తాన్ని తీసుకోవచ్చని తీసుకున్న తరువాత రక్తం ఇచ్చిన జంతువు ఆరోగ్య విషయాలను తెలియచేసారు.  అది రక్త దానం  చేయగలదా? దాని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?  ఎంతవరకూ ఇవ్వగలదు?  ఆ రక్తం వేరే కుక్కకు మ్యాచ్ అవుతుందా అనేది పరీక్షించవచ్చని వెల్లడించారు.

 

ఇలా కుక్కలకు రక్తదానం ఇస్తున్న సమయంలో కంటే పిల్లులకు ఇస్తున్నప్పుడే ఎక్కువ ఇబ్బంది అవుతుందని  డాక్టర్ వివరించారు.అయితే చివరగా జంతువులు అపాయం జరిగిన  సమయం లో రక్తదానం పరస్పరం చేసుకోవచ్చని అవసరం అయినప్పుడు  యజమానులు ఇతర  జంతువులకు సాయం చేసేందుకు సిద్ధంగానే ఉంది సాటి జంతువుల ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేసారు. అలాగే జంతువులు తమంతట తామే రక్తదానానికి రాలేవని, వాటి యజమానులే పశువుల రక్తదానంపై అవగాహన ఏర్పరచుకుని ముందుకు రావాలని డాక్టర్లు  పిలుపునిచ్చారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: