మొబైల్ ఫోన్‌ వాడకం  మరియు  టెలివిజన్ చూడటంలో ఎక్కువ సమయం గడపడం పిల్లల మానసిక మరియు శారీరక  అభివృద్ధిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని ఇటీవల నిర్వహించిన అనేక కొత్త పరిశోధనలు వెల్లడించాయి. అల్బానీలోని విశ్వవిద్యాలయం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మరియు న్యూయార్క్ యూనివర్శిటీ లాంగోన్ మెడికల్ సెంటర్ సంయుక్తంగా  ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం పిల్లలు టెలివిజన్ స్క్రీన్ ల ముందు గడిపే సగటు  సమయం గత మూడు సంవత్సరాలలో  53  నిమిషాల నుండి 150  నిమిషాలకు  పెరిగింది. పిల్లలు టెలివిజన్ ముందు గడిపే ఈ  సమయం  అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఏఏపి) సిఫారసులకు మించిన సమయం.

 

 

18 నెలల లోపు పిల్లలకు డిజిటల్ మీడియా వాడకాన్ని  నివారించాలి, 18 నుండి 24 నెలల వయస్సు గల పిల్లలకు డిజిటల్ మీడియా వాడకాన్ని మెల్ల మెల్లగా పరిచయం చేయాలి, 2 నుండి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు డిజిటల్ మీడియా వాడకాన్ని రోజుకు ఒక గంటకు  పరిమితం చేయాలి. అమెరికన్ పీడియాట్రిక్ అకాడమీ ప్రకారం  దాదాపు 87 శాతం మంది పిల్లలు  సిఫారసులను మించిన సమయాన్ని  టెలివిజన్  ముందు  గడుపుతున్నారు. పిల్లలు స్క్రీన్ సమయం ఉపయోగించడం మరియు తల్లిదండ్రుల విద్యా అర్హత ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉండవచ్చు.  హైస్కూల్ డిప్లొమా లేదా సమానమైన విద్య అర్హత కలిగిన తల్లిదండ్రుల  పిల్లలు ఈ వర్గంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా  ఉంది. ఒంటరిగ  జన్మించిన పిల్లలతో పోల్చితే కవలలు అత్యధిక స్క్రీన్ టైమ్ గ్రూపుకు చెందినవారుగ వుంటారు.

 

 

బెల్ సహ-నేతృత్వంలోని ఈ అధ్యయనం, దాదాపు 4000 మంది తల్లులు వారి పిల్లలు 12,18,24,30 మరియు 36 నెలల వయస్సులో ఉన్నప్పుడు వాళ్ళ డిజిటల్ మీడియా వాడకం పై ప్రశ్నలు అడగగా  సమాదానాలు  ఇచ్చారు. అదేవిదంగా వీరు తమ పిల్లలు 7  మరియు 8 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చారు. ఈ అధ్యయనం  పిల్లలు మరియు తల్లుల జనన రికార్డులు మరియు జనాభా లెక్కల సమాచారాన్ని కలిగిఉంది. 

 

 

బెల్ తన పరిశోధనకు బలాన్ని చేకూరుస్తూ యునిస్ కెన్నెడీ శ్రీవర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్‌ కూడా " స్క్రీన్ టైం పిల్లల మానసిక మరియు శారీరక అభివృద్ధి పై ప్రభావం" చూపుతుందని  పేర్కొంది. అలాగే ఈ  పరిశోధన చిన్న తనం  నుండే  పిల్లల స్క్రీన్ టైం ను తగ్గించే వ్యూహాలను రచించాలని సూచిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: