సాధార‌ణంగా పచ్చికొబ్బరితో కొందరు పచ్చళ్లు చేసుకుంటూ ఉంటారు. అలాగే గుడికెళ్ళినప్పుడో, పండగ సమయాల్లోనే అరుదుగా ప్రసాద రూపంలో పచ్చి కొబ్బరిని తింటుంటాం. మ‌రి కొంద‌రు ప‌చ్చి కొబ్బ‌రిని డైరెక్ట్‌గా తింటారు. అయితే పచ్చి కొబ్బరి తింటే దగ్గు వచ్చేస్తుందంటూ కొంద‌రు దానితో పచ్చడో, కూరలో కలుపుగానో వాడుతారు. అతిగా తింటే దగ్గొస్తుంది కానీ, పరిమితిగా తింటే బోలెడన్నీ లాభాలు ఉన్నాయి. ప‌చ్చి కొబ్బ‌రిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో కీల‌క పోష‌కాలు ఉంటాయి. కేవ‌లం రుచి మాత్ర‌మే కాదు, ప‌చ్చి కొబ్బ‌రి వ‌ల్ల మ‌నకు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

 

యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ పారాసైట్ గుణాలు ప‌చ్చి కొబ్బ‌రిలో పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల క్రిములు, బాక్టీరియ‌లు, వైర‌స్‌ల నుంచి మ‌న‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ప‌చ్చి కొబ్బ‌రిని నిత్యం ఏదో ఒక విధంగా తింటూ ఉంటే దాంతో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి. కొబ్బరి తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడడమే కాదు.. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. చర్మానికీ మేలు జరుగుతుంది. వృద్ధాప్య చాయలు దరిచేరవు.

 

డ‌యాబెటిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ప‌చ్చి కొబ్బ‌రి తింటే మేలు జ‌రుగుతుంది. దీంతో వారి ర‌క్తంలోని షుగ‌ర్ స్థాయిలు అదుపులోకి వ‌చ్చి డ‌యాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది. కొబ్బరిలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. దీనిని తినడం వల్ల గుండెకి చాలా మంచిది. కనుక గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు రోజుకో ముక్క తినడం మంచిది. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడే ఔష‌ధ గుణాలు ప‌చ్చి కొబ్బ‌రిలో ఉన్నాయి. ప‌చ్చి కొబ్బ‌రిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్స‌ర్ క‌ణ‌తుల వృద్ధిని అడ్డుకుంటాయి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: