జామపండు తింటే ఇక ఆరోగ్యం మీచేతిలో ఉన్నట్టే. ఇది ఎవరో చెబుతున్నది కాదు, స్వయానా పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఒక జామకాయ తింటే పది ఆపిల్స్ తిన్నదానితో సమానమంటున్నారు వారు. జామపండ్లతో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో... జామ ఆకులతోనూ చాలా ఉన్నాయి. జామ ఆకులతో టీ తయారుచేస్తారని తెలుసా. జామకాయలు, ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్లో ఎక్కడ చూసినా జామకాయలే కనిపిస్తున్నాయి కాబట్టి. విరివిగా, చౌకగా దొరికే ఈ జామకాయలు విలువలేనివని అనుకోకూడదు. విలువైన పండ్లలో వుండే న్యూట్రీషియన్స్ ఈ జామలోనూ అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువకాలం దొరుకుతూ ఉంటాయి. 


అపరిమిత పోషకాల నిలయం జామ. అనారోగ్యాన్ని దరిచేరనీయని జామ. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. జామలో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయని, ఎన్నో వ్యాధుల నివారణకు దోహదపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. జామ తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. విటమిన్-ఏ,సీ, ఈ పుష్కలంగా ఉన్న జామపండులో పోషక విలువలు మెండుగా ఉన్నాయి. ఒక జామకాయ తింటే పది ఆపిల్స్ తిన్నదానితో సమాన మని పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు.


మలబద్దకం నుండి విముక్తి..
ఆహారపు అలవాట్లు, ఒత్తిడి ఇతర రకాల కారణాలవల్ల మల బద్దకంతో బాధపడుతున్నారు.  దీనికి పరిష్కారం జామ అని చెప్పుకోవచ్చు. ఒక జామకాయలో 688 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. అంటే అరటి పండు కన్నా 63శాతం ఎక్కువ. బాగా పండిన జామ పండ్లను కోసి కొద్దిగా మిరియాల పొడిని చేర్చి, నిమ్మరసం కలుపుకొని తింటే తరుచూ వేధించే మలకబద్ధకం సమస్య దూరమవుతుంది.

 

కాన్సర్‌కి రాకుండా ఉండాలంటే..
కాన్సర్ వస్తే... దాన్ని వదిలించుకోవడం ఓ సాహసమే. అసలు కాన్సరే రాకుండా చేసుకుంటే బెటర్ కదా. జామ ఆకుల్లో కాన్సర్‌ను నిరోధించే గుణాలున్నాయి. కాన్సర్ కణాల సంఖ్య పెరగకుండా కూడా ఇది చేస్తుంది. కణాలను కాపాడుతుంది. కాన్సర్ మందుల కంటే... జామ రసం నాలుగు రెట్లు ఎక్కువగా ప్రభావం చూపించగలదని పరిశోధనల్లో తేలింది.


జలుబు నుంచి ఉపశమనానికి...
జామపండులో విటమిన్-సి అధిక మొత్తంలో ఉండడంతో వైరస్ కారణంగా వ్యాపించిన జలుబు నివారణకు బాగా పనిచేస్తుంది. కానీ, జామలో ఉండే సహజమైన కవ ప్రకోవకర అంశాలతో కొంతమందికి జలుబు తగ్గాల్సింది పోయి పెరిగే అవకాశం ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు జామను కొద్దిగా నిప్పుల మీద వేడిచేసి, సైందవ లవణం, మిరియాల పొడిని కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.


మధుమేహగ్రస్తులకు..
చక్కెర వ్యాధిగ్రస్తులు తప్పక తినవలసిన పళ్ల జాబితాలో జామను మొదటి వరుసలో ఉంచబడింది. డయాబెటిస్ రోగులకు సంజీవనిలా ఉపయోగపడుతుందంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు. బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్ధం ఎక్కువగా ఉండటంతో ఇది సుగర్ వ్యాధికి చక్కటి ఔషధం మరి.


చర్మానికి మేలు..
జామకాయ నిండా పోషకాలే. పైగా ఫైబర్ కూడా ఉంటుంది. తింటే మంచి ఆహారం తిన్నట్టే. జామ ఆకులు కూడా అంతే. చర్మానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి. బయటి కాలుష్యం వల్ల మన చర్మం పాడైపోతుంది. అడ్డమైన మచ్చలు, కణతులు, ఏవేవో వస్తుంటాయి చాలా మందికి. వాళ్లు జామకాయలు తింటూ... జామ ఆకుల రసం తాగేస్తూ ఉంటే... ఆటోమేటిక్‌గా స్కిన్ నయమవుతుంది. చర్మం ముడతలు పడకుండా జామకాయ కాపాడుతుంది.


తలనొప్పికి నివారణకు..
దోరజామపండును కొంచం అరగదీసి నుటిమీద రాసుకున్నట్లయితే తలనొప్పినుండి ఉపశమనం కలుగుతుంది. 

 

శారీరక బలానికి...
బాగా పండిన జామ పండ్ల గుజ్జులోంచి గింజలు తొలగించి పాలు తేనె కలిపి తీసుకుంటే విటమిన్-సి, కాల్షియం మెండుగా లభిస్తాయి. పెరిగే పిల్లలకు, గర్భిణులకు దీనిని టానిక్‌లా వాడవచ్చు. క్షయ, ఉబ్బసం, బ్రాంకెటైటీస్, గుండె బలహీనత, కామెర్లు, హైపటైటీస్, జీర్ణాశయ అల్సర్లు, మూత్రంలో మంటలాంటి అనేక రకాల సమస్యల పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. జామపండులో విటమిన్- ఈ, ఒగరుతనం కలిగి ఉండడంతో చర్మానికి రక్షణ కల్పిస్తుంది. సి-విటమిన్ అధికంగా ఉండడంతో తొందరగా చర్మకణాలు అతుక్కొని త్వరిత ఉపశమనాన్ని కలిగించేలా చేస్తుంది. వీటితో పాటు జుట్టు రాలటాన్ని నివారిస్తుంది. విటమిన్-ఏ అధికంగా ఉండే జామపండుతో కంటి సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. ఏ-విటమిన్ కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: