సాధార‌ణంగా మార్నింగ్ లేవ‌గానే బ్ర‌ష్ చేయడం అంద‌రికీ ఉన్న అల‌వాటు. ప‌ళ్లు త‌ల‌త‌లా మెర‌వాల‌న్నా.. నోటి నుండి దుర్వాసన రాకుండా ఉండాల‌న్న బ్ర‌ష్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. బ్రష్‌ చేయడం కాస్త లేటయినా నోటి నుంచి దుర్వాసన రావడం మొదలవుతుంది. వాస్త‌వానికి రాత్రులు కొన్ని గంటలపాటు నిద్రలోఉండటంవల్ల ఆ సమయంలో నోటి ద్వారా బయటకు రావాల్సిన లోపలిగాలి ముక్కు నాళాల ద్వారా రావడం జరుగుతుంది. ఈ సమయంలో గొంతు వాహికలు, దవడ, నాలుక భాగాలు కొంత మేరకు విశ్రాంతిలో ఉంటాయి. దీంతో జీర్ణ ప్రక్రియకు సంబంధితమైన వాయువులు నోటి ద్వారా రాలేవు. 

 

దీంతో నోటి అంతరభాగంలోనే అవి పేరుకుపోవడం కారణంగా దుర్వాసనగల బ్యాక్టీరియా తయారవుతుంది. దీంతో నోటి ద్వారా బయటకు దుర్వాసన వస్తుంది. నోరు, దంతాలు పరిశుభ్రంగా ఉండకపోతే రక్తంలో బాక్టీరియా పెరిగి తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అయితే నిత్యం మూడు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు దంతధావనం చేస్తే దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.

 

అయితే అదే ప‌నిగా బ్రష్‌ నిండా టూత్‌ పేస్టు పెట్టుకొని గంటల పాటు పళ్లను రుద్ద‌డం అంత మంచిది కాదు. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. దాన్ని క్రాస్ చేస్తే అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అందుకే ఉదయం నిద్ర లేవగానే ఒకసారి, రాత్రి భోజనం అయ్యాక, నిద్రపోయే ముందు ఒకసారి బ్రష్‌ చేసుకోవడం మంచిది. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇటు నోటి దుర్వాస‌న‌కు.. అటు గుండె జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: