సాధారణంగా డ్రై ప్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని ప్రతిరోజు క్రమంతప్పకుండా తీసుకోవటం వలన చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. వాల్ న‌ట్స్‌ ఇవీ డ్రై ఫ్యూట్స్ .. అచ్చం రాళ్ల‌ను పోలి ఉంటాయి. కానీ ఇవి మ‌న‌కు అందించే లాభాలు మాత్రం అనేకం. వీటిని తిన‌డం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటి వల్ల శరీరానికి కావల్సిన కీల‌క‌ పోషకాలు అందడమే కాక అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి.


వాల్ నట్స్ అంటే కేవలం డ్రై ఫ్రూట్స్ అన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. అలాగే ఇవి కేవలం మెదడుకి, మెమరీ మెరుగుపరచడానికి మంచిదని కూడా తెలుసు. అయితే వాల్ నట్స్ కేవలం మెదడు ఆరోగ్యానికే కాదు.. వీటిని సరైన విధంగా తీసుకోవడం వల్ల.. అనేకానేక లాభాలు, ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు.

 

ముఖ్యంగా వాల్ నట్స్ ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులను తగ్గిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు శరీరంలో మెటబాలిక్ రేటును క్రమంగా పెంచుతాయి.

 

వాల్‌న‌ట్స్‌ను నిత్యం తిన‌డం వ‌ల్ల లివ‌ర్ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. నాన్ ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్ ఉన్న‌వారు వాల్‌న‌ట్స్‌ను తింటే ఆ వ్యాధి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. అలాగె వాల్ నట్స్‌లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి అన్ని రకాల హార్ట్ డిసీజస్‌ను ఎదుర్కొనడానికి  సహాయపడతాయి. 

 

వాల్ నట్స్ ని నానబెట్టి తినడం వల్ల బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. దీంతో గుండె వ్యాధుల రిస్క్ దరిచేరదు. వాల్ నట్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఒత్తిడి, డిప్రెషన్ ని తగ్గించడానికి సహాయపడతాయి. రెగ్యులర్ గా వాల్ నట్స్ ని నానబెట్టి తీసుకుంటూ ఉంటే.. మూడ్ ని కూడా మెరుగుపరుస్తాయి. ఒత్తిడి, డిప్రెషన్ కి దూరంగా ఉంటారు. ప్రతిరోజు మన డైట్లో వాల్ నట్స్‌ను చేర్చుకోవడం చాలా మంచిది. ఇది బ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుంది. నిత్యం గుప్పెడు వాల్‌న‌ట్స్‌ను తింటే లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: