ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ భారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చిన్న పెద్ద అని తేడ లేకుండా ఈ డయాబెటిస్ అందరికి వచ్చేస్తుంది. డయాబెటిస్ వచ్చిన వారు ఆ వ్యాధి వల్ల చనిపోయే ప్రమాదం తక్కువ ఉన్నప్పటికీ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అయితే డయాబెటిస్ ని కంట్రోల్ చెయ్యడానికి అన్నం తక్కువ తినాలి.. యోగ ఎక్కువ చెయ్యాలి.. పండ్లు తీసుకోవాలి.. ఇలా చెయ్యాలి ఆలా చెయ్యాలి అని చెప్తుంటారు. 

               

అయితే అవి మాత్రమే కాదు.. డయాబెటిస్ నియంత్రణకు ఆహారం, వ్యాయామం ఎలానో నిద్ర కూడా అంతే కీలకమని పరిశోధనలు చెప్తున్నాయి. కోల్‌కాతాలోని ఎఎమ్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో ఎండోకిరనాలజిస్టుగా ఉన్న డాక్టర్‌ బినాయక్‌ సిన్హా సేకరించిన సమాచారం ప్రకారం, నిద్రలేమి ఇన్సులిన్‌ నిరుపయోగత్వాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని స్పష్టంచేశారు. 

            

దీనికి తోడు నిద్రలేమి గ్లూకోజ్‌ జీవక్రియా వ్వవస్థనే అస్తవ్యస్తం చేస్తుందని వారి ఆధ్యయనంలో బయటపడింది. ఎక్కువ రాత్రులు ఆరుగంటల కన్నా తక్కువగా నిద్రించే వాళ్లల్లో షుగర్‌ పెరిగే అవకాశం మిగతా వారి కన్నా మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు. 

                 

అయితే నిద్ర తక్కువ అవుతే ఎన్నో సమస్యలు వస్తాయని.. కొందరు అధికంగా లావు అవుతారని.. మరికొందరు డయాబెటిస్ నియంత్రణ ఉండదు అని రోజుకు కనీసం 7 నుంచి 9 గంటలు నిద్ర ఉండాలని పరిశోధకలు చెప్తున్నారు. అయితే నిద్ర తక్కువ అవుతే ప్రస్తుతం కాకపోయినా భవిష్యేత్తులో ఎన్నో సమస్యలు ఎదురుకోవాల్సి వస్తుంది అని పరిశోధకులు చెప్తున్నారు. చూశారుగా.. నిద్రలేమి వల్ల ఎన్ని సమస్యలో.. కాబట్టి ఇప్పటి నుండి అయినా 7 గంటలు పైన నిద్రపోయేలా ప్రణాళిక వేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: