వెల్లుల్లి గురించి తెలియని వారు దాదాపు ఉండరనే చెప్పాలి.  వెల్లుల్లి అనగానే ఇష్టపడేవాళ్లు కొందరుంటే, దాని వాసన కూడా నచ్చని వాళ్లు మరికొందరుంటారు. వెల్లుల్లి వాసన డిఫరెంట్‌గా ఉంటుంది. అందువల్ల ఇది కూరలకు ప్రత్యేక రుచిని ఇస్తుంది. ఇక‌ వెల్లుల్లితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. దీన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్యాల బారి నుంచి బయటపడొచ్చు. జలుబు, కాలేయ సంబంధ సమస్యలు, జుట్టు రాలిపోవడం, హర్మోన్ల సమస్యలు, నిద్రలేమి వంటి వాటికి ఇది మంచి పరిష్కారం. 

 

అయితే ఆరోగ్యానికి వెల్లుల్లి మంచిదే అయినా.. పచ్చి వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం అలాగే వెల్లుల్లిని ఆహారంలో మరీ ఎక్కువగా వాడటం వలన ప్రాణాపాయ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దేనికైనా లిమిట్ ఉంటుంది క‌దా..! అలాగే పచ్చి వెల్లుల్లిని మరీ ఎక్కువగా తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ హెల్త్ పై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉంది. వెల్లుల్లి వలన జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వెల్లుల్లిని ఆహారంలో మితంగా వాడాలి. అలాగే, వాటిని పచ్చిగా తినడాన్ని అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా గర్భిణీలు వెల్లుల్లిని అతిగా తీసుకోకూడదు. అతిగా వెల్లుల్లిని తీసుకోవడం వలన గర్భిణీలలో ముందస్తు ప్రసవం అయ్యే సూచనలు కనిపిస్తాయి. 

 

మ‌రియు అతిగా పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం వలన స్కిన్ ఇరిటేషన్ కి గురికావచ్చు. ఎందుకంటే వెల్లుల్లిలో అల్లీయిన్ ల్యాస్ అనే ఎంజైమ్ కలదు. ఇది స్కిన్ ని ఇరిటేషన్ కి గురిచేస్తుందని తెలుసుకోవాలి. వెల్లుల్లిని అతిగా తీసుకోవడం వలన లివర్ పనితీరు దెబ్బతినవచ్చు. లివర్ అనేది శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఓ ఆధ్యాయ‌నం ప్రకారం వెల్లుల్లిని అధిక మొత్తంలో తీసుకుంటే లివర్ టాక్సిసిటీ సమస్యకు దారితీయవచ్చ‌ని తేలింది. సో.. బీ కేర్‌ఫుల్‌..!

మరింత సమాచారం తెలుసుకోండి: