భార్యభర్తలు లేదా.. ఏదైన ఓ జంట ప్రేమగా అన్యోన్యంగా కలిస్ ఉంటున్నారా.. లేదా.. అనేది వారి స్వ‌భావాన్ని బట్టి చెప్పేయవచ్చట. ఇంట్లో కానీ బయట కానీ.. ఒక‌రి ప‌ట్ల ఒక‌రు ఎలా ఉంటున్నారో అనే విషయంను బట్టి.. ఆ జంత మధ్య ఉన్న అన్యోన్య‌త‌ను చెప్పవచ్చు. అయితే ఇది కాకుండా, జంట‌లో ఆడైనా, మ‌గైనా ఎవ‌రైనా నిద్రించే స్వ‌భావం, తీరు, భంగిమ‌ని బ‌ట్టి కూడా వారి మ‌ధ్య ఎంతటి ఆప్యాయ‌త ఉందో ఇట్టే తెలుసుకోవ‌చ్చ‌ట‌. అదేలానో ఇప్పుడు చూద్దాం..

 

జంట ఇద్దరు పడుకునే ముందు చేతులు, కాళ్లు వేసుకుని ద‌గ్గ‌రగా ఉంటూ.. రాత్ర‌య్యే కొద్దీ దూరంగా జ‌రుగుతూ నిద్రించారనుకోండి. అప్పుడు అలాంటి జంత మధ్య ఎలాంటి అన్యోన్య‌త ఉంటుందంటే ఇద్దరూ వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకుంటూనే కలిసి ఉండాలని భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

 

జంట ఇద్ద‌రూ క‌లుసుకుని కాకుండా అటొక‌రు, ఇటొక‌రు శ‌రీరం పెట్టి నిద్రిస్తున్నార‌నుకోండి, అలాంటి వారి మ‌ధ్య రిలేష‌న్‌షిప్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కానీ ఇద్ద‌రూ వ్య‌క్తిగత స్వేచ్ఛ‌ను కోరుకుంటూ ఉంటారు.

ఒక‌రి వీపు మరొక‌రికి త‌గిలేట్టు జంట ప‌డుకుంటే దాంతో వారి మ‌ధ్య కొత్త బంధం బ‌ల‌ప‌డుతున్న‌ట్టు గుర్తించాలి. సాధార‌ణంగా వివాహం అయిన కొత్త దంప‌తులు ఇలా నిద్రిస్తారు.

జంట ఇద్ద‌రూ ఒక‌ర్నొక‌రు హ‌త్తుకుని రాత్రంతా ప‌డుకుని ఉంటే దాంతో ఇద్ద‌రికీ ఒక‌రంటే ఒక‌రికి అమిత‌మైన ప్రేమ ఉంటుంది. ఇద్ద‌రూ ఒకర్ని విడిచి ఒక‌రు ఉండ‌లేరు.

దంప‌తులిద్ద‌రూ ఎదురెదురుగా ముఖాలు పెట్టి ట‌చ్ అవ‌కుండా నిద్రిస్తుంటే ఇద్ద‌రూ త‌మ భాగ‌స్వామితో అన్యోన్య‌మైన రిలేష‌న్‌షిప్‌ను పొందేందుకు చూస్తున్నార‌ని అర్థం చేసుకోవాలి.

జంట‌లో ఆడైనా, మ‌గైనా ఒక‌రు ఇంకొక‌రిని వెన‌క నుంచి హ‌త్తుకునిప‌డుకుంటే వారు ఎదుటి భాగ‌స్వామికి అత్యంత ర‌క్ష‌ణ‌నిస్తున్న‌ట్టు అర్థం చేసుకోవాలి. ఇలాంటి వారికి ఒక‌రిపై ఒకరికి బాగా న‌మ్మ‌కం ఉంటుంది.

జంట‌లో ఆడైనా, మ‌గైనా ఎవ‌రో ఒక‌రు బెడ్ మొత్తం ఆక్ర‌మించి త‌మ భాగ‌స్వామిని మూల‌కు నెడుతూ ప‌డుకోబెడితే అలాంటి వారు త‌మ రిలేష‌న్ షిప్‌లో బాగా డామినేట్ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: