హార్ట్ ఎటాక్ ఎప్పుడు.. ఎవరికి ఎందుకు వస్తుందో అస్సలు అర్థంకాదు. ఈ హార్ట్ ఎటాక్ కారణంగా ఎంతో మంది అక్కడిక్కడే ప్రాణాలు విడుస్తారు. అలంటి హార్ట్ ఎటాక్ రాకుండా ఉండలు అంటే ఈ చిట్కాలు పాటించండి. ఆ చిట్కాలు ఏంటి అంటే.. వంటకు ఎలాంటి నూనె వాడాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

                    

వెజిటబుల్‌ ఆయిల్స్‌లో కొలెస్ట్రాల్‌ ఉండదు కానీ అతిగా నూనె తీసుకుంటే శరీరంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది. ముఖ్యంగా పొట్ట భాగంలో. దీనివల్ల ఉదర భాగంలో ఉన్న ఆర్గాన్స్‌కి ప్రమాదమే. హార్ట్‌ ఎటాక్‌ రాకుండా ఉండాలంటే చాలా చిట్కాలు పాటించాలి. అవి ఏంటి అనేది ఇక్కడ చదవండి. 

                          

ఆయిల్స్‌ రెండు మూడు రకాలు వాడాలి.. అంటే పప్పులో ఒక ఆయిల్‌, కర్రీ కోసం ఒక ఆయిల్‌ ఇలా వాడితే ఎంతో మంచిది. ఏ ఆయిల్‌ వాడినా రోజుకు 30 గ్రాములకు మించకుండా చూసుకోవాలి. 

                

బేకరీ ఫుడ్‌, బిస్కట్లలో హైడ్రోజినేటేడ్‌ ఆయిల్‌ వాడతారు కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.

                  

వారానికి రెండు లేదా మూడుసార్లు వైట్‌ ఫ్యాటీ ఫిష్‌ తీసుకోవాలి.

                     

శాకాహారులు బాదం, అవిసెలు క్రమం తప్పకుండా మోతాదు మించకుండా తీసుకోవాలి. 

 

రోజుకు 500 గ్రాములకు మించి పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.

 

ప్రతీరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడవాలి. కంటినిండా నిద్ర పోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: