చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే  భారత్ ను 'డయాబెటిస్ రాజధాని’ అంటారని. నిజం చెప్పండి ఈ విషయం మీకు తెలుసా? నిజానికి మనదేశంలో ఏకంగా 50 మిలియన్లకి పైగా జనాభా టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్నారు. సరైన సమయంలో ఈ వ్యాధిని గుర్తించటం, మందు తీసుకోవటం వలన ఈ వ్యాధి కాస్త నియంత్రణలో ఉంటుంది. అయితే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే ప్రభావవంతమైన సహజ చిట్కాను తెలుసుకోండి. 

 

కాకరకాయ లేదా కరేలా మనందరికీ నచ్చీనచ్చకుండా ఉండే ఒక కాయగూర. ఇది తినే వారందరికీ దాని ప్రాముఖ్యత తెలుసు, కానీ చాలా మంది భోజనంలో దాన్ని తినడానికి ఇష్టపడరు. మళ్లీ ఒకసారి ఈ మంచి కాయగూరను పడేసేటప్పుడు, ముందు ఇది చదవి ఆలోచించండి! పరిశోధనల్లో తేలింది ఏమిటంటే ప్రతిరోజూ మీ డైట్ లో కాకరకాయ రసాన్ని జతచేయటం వలన, రోజుకి ఒకసారి తాగితే మీ రక్తంలో చక్కెర స్థాయిచాలా అంటే చాలా తగ్గుతుంది. అంతే కాదు, ఈ రసంలో చాలా విటమిన్లు, ఖనిజ లవణాలు, ఆహారంలో ఉండే పీచు ఇందులో ఉంటాయి. ఇది బరువు తగ్గటంలో కూడా సహాయపడుతుంది. ఎక్కువ తినకుండా, ఎక్కువసేపు కడుపు నిండివుండేట్లు ఇది చేస్తుంది.

 

ఇది ఎలా పనిచేస్తుంది అన్న విషయానికి వస్తే కాకరకాయలో మధుమేహ వ్యతిరేక లక్షణాలు పూర్తిగా ఉంటాయి. చారన్టిన్, పాలీపెప్టైడ్ - 2 లు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించటానికి సాయపడటమేకాక గుండెపోటు వచ్చే అవకాశాలను చాలా వరకు ఇది తగ్గిస్తుంది. ఇందులో పూర్తిగా యాంటీఆక్సిడెంట్లు నిండివుండటం వలన, ఇది మీ రోగనిరోధక వ్యవస్థను కూడా చాలా బాగా బలపరుస్తుంది. అంతే కాకుండా వయస్సు మీరకుండా చర్మకణాలను కాపాడుతుంది, అలాగే శరీరంలో వాపులు రాకుండా ఇది సహాయ పడుతుంది. మీరెప్పుడు దాన్ని తాగాలంటే ఈ కాకరకాయ రసాన్ని తాగటానికి మంచి సమయం పొద్దున్నే పరగడపున, ఖాళీ కడుపున తాగాలి. కాఫీ కూడా తాగకముందే దీన్ని తాగాల్సి ఉంటుంది. కానీ మీకు ఎసిడిటీ ఉన్నట్లయితే, మధ్యాహ్నం భోజనం తర్వాత తాజా రసంలాగా తాగండి.

మరింత సమాచారం తెలుసుకోండి: