చేపలు మానవ శరీరానికి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలుగజేస్తాయి. చేపలలో ముఖ్యంగా ఫాస్పరస్, కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు ఉంటాయి. ఒక పరిశోధనలో వారంలో రెండుసార్లు చేపలు తినేవారికి గుండెజబ్బులు తక్కువగా వచ్చే అవకాశం ఉందని తేలింది. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచి చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపిస్తాయి. 
 
చేపలు తినడం వలన కంటి సమస్యలు తక్కువగా వస్తాయి. గర్భంతో ఉన్న మహిళలు చేపలు తింటే గర్భంలో పెరిగే పిండం మెదడు యొక్క అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. చేపలు శరీరంలో జీవక్రియలను మరియు మెదడు ఆలోచనలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. చేపలు ప్రశాంతమైన నిద్రను పొందడంలో కూడా సహాయపడతాయి. చేపలు తినేవారిలో అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం తక్కువని పరిశోధనల్లో తేలింది. 
 
చేపలు శరీరంలో రక్తం గడ్డ కట్టడాన్ని తగ్గించి రక్తపోటును కూడా తగ్గించే అవకాశం ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది. చేపలు తినేవారిలో డిప్రెషన్ కు సంబంధించిన లక్షణాలు కూడా తగ్గుతాయి. చేపలు అర్థరైటిస్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. గొంతు క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, నోటి క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించటంలో చేపలు సహాయపడతాయి. చేపలు తినేవారిలో ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు తక్కువ. చేపలను తరచుగా తినే మహిళలలో ముందస్తు బహిష్టు సమస్యలు తగ్గుతాయి 

మరింత సమాచారం తెలుసుకోండి: