కౌగిలింత వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీన్ని మేం ఏదో ఆషామాషీగా చెప్ప‌డం లేదు. ఎందుకంటే.. సైంటిస్టులు ప‌రిశోధ‌న‌ల్లో తేలిన నిజ‌మిది. కౌగిలింత వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయ‌ని వారు చెబుతున్నారు. మ‌రి ఆ లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

 

 1. ఒకే చోట పొద్ద‌స్త‌మానం కూర్చుని ప‌నిచేసేవారు, శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేసేవారు కౌగిలింత వ‌ల్ల రిలాక్స్ అవ్వొచ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. దీని వ‌ల్ల ఒత్తిడి త‌గ్గ‌డంతోపాటు మెద‌డు షార్ప్‌గా మారుతుంది. అలాగే కండ‌రాల నొప్పులు త‌గ్గుతాయి.

 

2. కౌగిలించుకున్న‌ప్పుడు మ‌న‌లో ఆక్సిటోసిన్‌, డోప‌మైన్‌, సెరొటోనిన్ అనే ర‌సాయ‌నాలు విడుల‌వుతాయి. ఇవి మెద‌డును శాంత ప‌రుస్తాయి. దీని వ‌ల్ల మూడ్ మారుతుంది. డిప్రెష‌న్ త‌గ్గుతుంది. ఆందోళ‌న‌, ఒత్తిడి త‌గ్గి ఒక్క‌సారిగా రిలాక్స్ అవుతారు. అలాగే హైబీపీ కూడా త‌గ్గుతుంది
 
3. కౌగిలింత వ‌ల్ల శ‌రీరంలో ఉండే వాపులు కూడా త‌గ్గుతాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్‌, హార్ట్ ఎటాక్స్ రాకుండా ఉంటాయ‌ట. అలాగే శ‌రీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్ నాశ‌న‌మ‌వుతాయి. దీంతో శ‌రీరంపై దుష్ప్ర‌భావాలు ప‌డ‌కుండా ఉంటాయి.

 

4. కౌగిలింత వ‌ల్ల బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంద‌ని, ద‌గ్గు, ఫ్లూ జ్వ‌రం రాకుండా ఉంటాయ‌ని, క్యాల‌రీలు త్వ‌ర‌గా ఖ‌ర్చ‌యి అధిక బ‌రువు తగ్గుతార‌ని కార్నెగీ మెలాన్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు చేసిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. అలాగే జ్ఞాప‌క‌శ‌క్తి కూడా పెరుగుతుంద‌ట‌.

 

5. నిత్యం జీవిత భాగ‌స్వాములు కౌగిలించుకోవ‌డం వ‌ల్ల వారు కొంత కాలం ఎక్కువ‌గా బ‌తుకుతార‌ని, వారు చూసేందుకు య‌వ్వ‌నంగా క‌నిపిస్తార‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డిస్తున్నాయి.

 

6.మ‌నం ఎవ‌ర్న‌యినా కౌగిలించుకున్న‌ప్పుడు మ‌న‌లో థైమ‌స్ గ్రంథి ఉత్తేజానికి గుర‌వుతుంద‌ట‌. దీంతో మ‌న శ‌రీరంలో తెల్ల ర‌క్త క‌ణాల సంఖ్య పెరుగుతుంది. అలాగే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. దీంతో వ్యాధులు రాకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: