మనం.. బతుకుతున్నది ఎందుకు? తినడానికి! నేను అయితే తినడానికే బతుకుతున్న.. కొత్త కొత్త రుచులు చూస్తూ.. జీవనం సాగిస్తే ఎంత అద్భుతం. అందుకే నేను కష్టపడి పని చేసి నాకు నచ్చిన ఆహారాన్ని ఎంత కావాలంటే అంత తింటున్న.. కానీ ఈ వార్తలు రాసె వారు ఉన్నారే.. అంటే నాలాంటి వల్లే అన్ని భయపెట్టేస్తారు.. 

 

కానీ ఆలా భయపెట్టడానికి ఒక కారణం ఉంది లెండి.. అది ఏంటంటే ? ఆలా బయపెట్టకపోతే.. అంటే నాలాంటి వాళ్ళు మరి ఎక్కువ తినేసి 60ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు 30 ఏళ్లలోనే మరణిస్తారు. అందుకే ముందు జాగ్రత్తగా కొన్ని కొన్ని భయంకర నిజాలు చెప్తూ ఉంటాం. ఇప్పుడు వైద్యులు బయట పెట్టిన మరో భయంకర నిజాన్ని తెలుసుకోండి.  

 

మనం ఎంతో ఇష్టంగా తినే ఫ్రైడ్ చికెన్.. ప్రతిరోజూ తింటే ప్రాణాలకే ముప్పంటున్నారు వైద్యులు. తాజా సర్వేలో ఓ సంచలన నిజం బయటపడింది. ఫ్రైడ్ చికెన్ ఎక్కువగా తినే వారికి గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని తాజా సర్వేలో తేలింది. ఫ్రైడ్ చికెన్ తినేవారికి టైప్-2 డయాబెటిస్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

 

అంతే కాదు.. ఫ్రైడ్ చికెన్ ఎక్కువగా తినేవారిలో క్యాన్సర్ లక్షణాలనూ గుర్తించారు పరిశోధకులు. ఒక్క ఫ్రైడ్ చికెనే కాదు.. ఫ్రై చేసిన ఏ వస్తువులు తిన్నా అంతే. ఫ్రైడ్ ఫిష్, ఫ్రైడ్ మటన్, ఫ్రైడ్ చికెన్, మిగతా ఫ్రైడ్ ఐటెమ్స్ ఏది తిన్నా కూడా, యుక్త వయసులో ఉన్నవారికైనా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఫ్రైడ్ వస్తువులు తినడం పక్కన పెట్టండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: