అప్పుడే పుట్టిన ప‌సిపిల్లల్లో మృదువైన గుండ్రని తలను తరచుగా నిమరడం, ఆడుకోవడం తల్లిదండ్రులుగా మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంటుంది. క్రమంగా మీ శిశువు సంరక్షణల నిమిత్తం, అనేక మంది పెద్దలు మరియు వైద్యుల సహకారంతో వీరిపట్ల ప్రత్యేక శ్రద్దను కలిగి ఉంటారు. ఏ చిన్న అవాంతరం మీ శిశువుకు తలెత్తకుండా ఉండేలా సంరక్షణా చర్యలను తీసుకుంటూ ఉంటారు. అవునా ? అదేక్రమంలో భాగంగా మీ బిడ్డ ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత, త్రేన్పులు వచ్చే వరకు భుజం మీద వేసుకుని వెన్ను నిమరడం అత్యంత కీలకమైన అంశంగా ఉంటుంది. అంతేకాకుండా నిద్రించే సమయంలో ఆ బిడ్డను భిన్న వైపులకు తరచూ మార్చడం కూడా ఎంతో ముఖ్యంగా చెప్పబడుతుంది. క్రమంగా ఈ చర్యలు మీ పాపాయి హాయిగా నిద్రపోవడానికి మాత్రమే కాకుండా, వారి మానసిక, శారీరిక ఎదుగుదలకు కూడా దోహదపడుతుంది అంటే అతిశయోక్తికాదు. 

 


శిశువుకు ఫీడింగ్ చేసిన తరువాత తప్పనిసరిగా త్రేన్పులు తెప్పించడానికి గల ప్రాముఖ్యత ఏమిటంటే... వారు తీసుకునే ఆహరం కొంచమే అయినా, ఆ ఆహారంతో పాటుగా వీలైనంత గాలిని నోటి ద్వారా పీల్చుకోవడం జరుగుతుంటుంది. ఈ గాలి జీర్ణకోశ వ్యవస్థలో చిక్కుకుపోతుంది, ఇది వీలైనంత త్వరగా బయటకు విడుదల కావాలి. ఈ గాలిని తరచుగా విడుదల చేయని పక్షంలో, శిశువు తరచుగా అసౌకర్యాన్ని ఎదుర్కొంటుంది. మరియు ఇది కడుపులో అనేక సమస్యలకు దారితీసే అవకాశం కూడా ఉంది. క్రమంగా ఉబ్బరం, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఈ చిన్న గాలి బుడగలు మీ శిశువు కడుపులో పేరుకొన్నప్పుడు, అవి కడుపును పూర్తిస్థాయిలో నింపిన అనుభూతికి లోను చేస్తాయి, మరియు అసౌకర్యానికి దారితీస్తాయి. అంతేకాకుండా ఒక్కోసారి ఉబ్బరానికి కూడా దారితీయవచ్చునని నిపుణుల అభిప్రాయం. ఈ అసౌకర్యమైన భావన కారణంగా స్వయంచాలకంగా శిశువు ఏడవటం లేదా చిడిపెట్టడం చేస్తుంది. కావున తల్లిదండ్రులుగా, శిశువు త్రేన్పుల గురించిన కొన్ని విషయాలపట్ల అవగాహనను కలిగి ఉండడం ముఖ్యం. క్రమంగా వారు శిశువులకు త్రేన్పులను తెచ్చే విధానం గురించి తెలుసుకోవలసి ఉంటుంది. 

 

శిశువుకు త్రేన్పులు ఎలా వస్తాయి? పిల్లలు తమ కడుపులో గాలిని చేర్చుకోవడానికి ప్రధానంగా మూడు మార్గాలున్నాయి. ఒకటి జీర్ణక్రియ ప్రక్రియ ద్వారా, రెండవది ఆహారం వినియోగించే సమయంలో తరచుగా గాలిని మింగడం, మరియు మూడవదిగా ఆహారం సరిపడకపోవడంగా (శిశువు జీవక్రియలు మీరు ఇచ్చే ఆహారాన్ని ఒప్పుకోకపోతే) ఉంటుంది. మీ శిశువుకు సులభంగా త్రేన్పులు తెప్పించేందుకు, ప్రధానంగా రెండు ఉత్తమ మార్గాలు ఉన్నాయి. మీ శిశువును మీ భుజాల మీద ఉంచుకుని, శిశువు తలను నిటారుగా ఉంచి, వీపు మీద మృదువుగా తరచుగా నొక్కండి. కొన్ని నిమిషాల తర్వాత మీరు వెంటనే ఒక చిన్న త్రేన్పును వింటారు. మరొక పొజిషన్ మీ బిడ్డను మీ ఒడిలో కూర్చోబెట్టుకోవడం. క్రమంగా మీ చేతులను ఉపయోగించడం ద్వారా బిడ్డ దేహానికి మరియు తలకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మీ మరో చేతితో బిడ్డను వెనక్కి తిప్పి, శిశువుకు త్రేన్పు వచ్చేలా చేయడానికి ప్రయత్నించండి.శిశువుకు తరచుగా త్రేన్పులు రాని పక్షంలో, కడుపులోని వాయువు వారికి భారంగా మారి అసౌకర్యానికి దారితీస్తుంది. క్రమంగా తిన్న ఆహారం తరచుగా బయటకు వచ్చేయడానికి కూడా కారణం అవుతుంది. కావున త్రేన్పులు ఖచ్చితంగా రావాలని గుర్తుంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: