రొయ్యల వేపుడు, రొయ్యల కూర రుచికరమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి అంటున్నారు నిపుణులు. తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి రొయ్యలంటే బాగా ఇష్టం ఉంటుంది. కోస్తా వారికి రొయ్యలంటే ప్రాణం. కానీ మరికొన్ని ప్రాంతాల్లో రొయ్యలు అంతగా లభించవు కాబట్టి వాటిని టేస్ట్ కూడా చేయరు. అయితే రొయ్యల వల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ప్రమాదకరమైన జబ్బులను అరికట్టడంలో రొయ్యల ఎంతగానో పనిచేస్తాయని పరిశోధనలో తేలింది. రొయ్య‌ల్లో ఉండే ప్రోటీన్ మ‌న శ‌రీరంలో కండ‌రాల నిర్మాణానికి, కొత్త క‌ణ‌జాలం ఏర్పాటు అయ్యేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

 

రొయ్యల్లో నాణ్యమైన ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. తరచూ డైట్‌లో రొయ్యలకు చోటిస్తే.. కావాల్సినతం బలం వస్తుంది. అతి తక్కువ ఫ్యాట్‌ ఉండే మాంసాహారం రొయ్యలే. వీటిని ఆహారంగా తీసుకోవటం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో పాటు మెదడు, నరాల సంబంధిత జబ్బులు కూడా వచ్చే అవకాశం తక్కువ. చాలా మంది మతిమరుపుతో బాధపడుతుంటారు. అలాంటి వారు రొయ్యలు తింటే మంచిది. మతిమరుపు ఈజీగా పోతుంది. వీటిని తింటే క్యాల్షియం కూడా బాడీకి బాగా అందుతుంది.

 

ఇక రొయ్యల్లో ఉండే జింక్, సెలీనియం మగవారిలో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. వీర్యం కూడా బాగా పెరుగుతుంది. వీర్య కణాల సంఖ్యను పెంచుతాయి. రొయ్య‌ల్లో ఐర‌న్ పుష్క‌లంగా ఉంటుంది. అందువ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉన్న‌వారు రొయ్య‌ల‌ను తింటుంటే శ‌రీరంలో ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. చర్మకాంతికి తోడ్పడే 'విటమిన్‌ ఇ', విటమిన్‌ బి 12 లభిస్తాయి. రొయ్యల్ని తినటం వల్ల థైరాయిడ్‌ సమస్యలు తొలగిపోతాయి. డయాబెటిస్‌కు చక్కటి ఫుడ్‌.  మ‌రియు రొయ్యలు ఆహారంగా తీసుకోవటం వల్ల మానసిక బలహీనతలూ పోతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: