మనం జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలి కలిగి ఉండాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో మనం తీసుకునే ఆహారం మన శరీరంలో జీవక్రియలు అంటే అన్ని అవయవాలు పనిచేయడానికి ఒక ఇందనంలా పనిచేస్తాయి. అయితే పొద్దున పూట రాజులా పుష్టిగా తినాలి, మధ్యాహ్నం పూట మంత్రిలా ఆలోచించి తినాలి, రాత్రిపూట బంటులా కొద్దిగా తినాలి అని చెబుతుంటారు. ఇది ఎంత నిజ‌మో.. టైమ్ ప్ర‌కారం తిన‌డం కూడా అంతే ముఖ్యంగా అని చెప్పాలి.

 

ఇదిలా ఉంటే.. సాయంత్రం 6 గంటల తరువాత అధికంగా తినే మహిళలకు గుండె సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు తేల్చారు. సగటున 33 ఏళ్ల వయసున్న కొంత‌ మంది మహిళలపై అమెరికాకు చెందిన పరిశోధకులు చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. తమ పరిశోధనలో భాగంగా వారు ఆ మహిళల బీపీ, షుగర్ స్థాయిలను ఏడాది పాటు పరిశీలించారు. అలాగే ప్రతిరోజు సాయంత్రం 6 గంటల తరువాత అధిక కేలరీలున్న ఆహారాన్ని అధికంగా తీసుకునే మహిళల్లో కొలెస్ట్రాల్  స్థాయులు విపరీతంగా పెరిగాయి.

 

వారిలో గుండె సంబంధిత జబ్బులతో పాటు బీపీ, షుగర్ పెరిగింది. దీంతో వారికి గుండె పోటు వంటివి వచ్చే ప్రమాదం అధికమని పరిశోధకులు తెలిపారు. సో.. సాయంత్రం పూట తక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్నే తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే కొంద‌రు పగలు పూర్తిగా ఆహారం మాని, పొట్టను మాడ్చి రాత్రి లేటుగా అనేక రకాల వంటలను ఫుల్‌గా తిని పడుకుంటారు. అయితే పగలు తినే ఆహారానికి లావు అవ్వరు. కాని రాత్రి తినే ఆహారం వ‌ల్ల మాత్రం లావు అవ్వ‌డ‌మే కాకుండా.. అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: