హఠా త్తుగా కుప్పకూల్చేసే గుండె సమస్య యుక్త వయస్కుల్లో సాధారణంగా గుండె జబ్బు లక్షణాలు చివరివరకూ కనిపించవు. హఠాత్తుగా మూర్ఛ వచ్చినట్టు పడిపోవడం, కళ్లు తిరిగి పడిపోవడం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి గుండె సమస్యలు వస్తున్నాయి. ఈ బిజీ లైఫ్లో , టెన్షన్ లైఫ్, అధిక బరువుతో శరీరంలో కొవ్వు చేరడం వంటి అనారోగ్య సమస్యలు గుండె వ్యాధులు వచ్చేందుకు దారి తీస్తున్నాయి. హార్ట్ స్ట్రోక్ లు, గుండెకు వాల్స్ బ్లాక్ కావడం వంటి ఇబ్బందులు కామన్ అయిపోయాయి. 

 

అయితే ఈ పరిస్థితి తెచ్చుకోకూడదంటే ముచ్చటగా మూడు సూత్రాలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటంటే.. హర్రీ, వర్రీ, కర్రీలకు స్వస్తి చెప్పడమే ఈ సమస్యకు పరిష్కారమని అంటున్నారు. జీవితం అన్నాక కష్టసుఖాలు సర్వసాధారణమని చెప్పారు. కష్టం వచ్చినప్పుడు కుంగిపోయినంత మాత్రాన సమస్య నుంచి బయటపడలేమన్నారు. భయాందోళనకు గురయ్యేకంటే ఆ కష్టం నుంచి గట్టెక్కేందుకు మార్గం కోసం ప్రశాంతంగా ఆలోచించాలి. అలాగే ఒక్కోసారి సమస్యలు ఎదురవుతాయి. 

 

అలాంటి ప‌రిస్థితుల్లో కాస్త ప్ర‌శాంతంగా పనిని పూర్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తే హడావుడి పడాల్సిన అవసరం ఉండ‌దు. మ‌రియు రుచుల కోసం ఆరాటపడుతూ ఎక్కువమంది ఇంటి భోజనానికి స్వస్తి పలుకుతున్నారు. ఈ క్ర‌మంలోనే హోటల్‌ భోజనానికి మోజు పడుతున్నారు. దీనివల్ల ఒంట్లో కొవ్వు పేరుకుపోయి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకుంటున్నారు. సో.. ఈ మూడింటికి స్వస్తి పలికి.. ఆరోగ్యంమైన ఆహారంతో పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా  వైద్య పరీక్షలు చేయించుకుంటే గుండె స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: