సాధార‌ణంగా నెయ్యిని చాలా మందిని ఇష్టంగా తింటారు. కొన్ని రకాల వంటకాలలో నెయ్యిని అధికంగా వాడుతుంటారు. నెయ్యి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే అవసరానికి మించి వాడితే ఏదైనా సరే ఆరోగ్యానికి చేటు. నెయ్యి అధిక శక్తినిస్తుంది కాబట్టి తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఒక‌టి లేదా రెండు టేబుల్‌ స్పూన్స్‌ నెయ్యి ఒక్కరోజుకి ఒక్క వ్యక్తి తీసుకోవచ్చు. అయితే నెయ్యి తింటే బ‌రువు పెరుగుతామా.. త‌గ్గుతామా.. అన్న ప్ర‌శ్న చాలా మందిలో ఉంటుంది.

 

అయితే బరువు తగ్గాలనుకునేవారు ఆహారం విషయంలో చాలా కేరింగ్‌గా ఉంటారు. ఇవి తినాలి, అవి తినొద్దు అంటూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా నెయ్యికి కాస్త దూరంగానే ఉంటారు. కాని.. నెయ్యి తినడం వల్ల బరువు పెరుగతారన్నది కేవలం అపోహ మాత్రమే అని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే నెయ్యిలో గుండె కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోజూ తినడం వల్ల అధికబరువు త్వరగా తగ్గుతుంది. అయితే.. పైన చెప్పిన‌ట్టు రోజుకు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి మాత్రమే తీసుకోవాలి.

 

అదే విధంగా..  కొవ్వుతో కరిగి మన శరీరానికి ఉపయోగపడే విటమిన్లు ఎ,డి,ఇ,కె. ఇవి నెయ్యిలో ఉంటాయి. వీటి వల్ల చర్మం, ఎముకలు, కళ్ళు ఆరోగ్యంగా వుంటాయి. ఈ విటమిన్లు ఇతర జీవక్రియలో కూడా ఉపయోగపడతాయి.  నెయ్యి తగు మోతాదులో ట్యూమర్స్‌ని అరికడుతుంది. చర్మానికి అవసరమైనంత తేమని అందించి పొడిచర్మం సమస్య నుంచి తక్షణ ఉపశమనం కలిగించడంలో నెయ్యి ప్రధాన పాత్ర పోషిస్తుంది. సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను నివారించడంలో తోడ్పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: