ఆస్తమా ఒక తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. పిల్లలలో, పెద్దవారిలో కనిపించే ఈ వ్యాధి దీర్ఘకాలంగా మనిషికి ఊపిరి అందకుండా చేస్తుంది. ఆస్తమా వ్యాధి యొక్క ప్రధాన లక్షణం ఆయాసం. కలుషితమైన గాలి ఆస్తమా వ్యాధితో బాధ పడేవారికి చాలా ప్రమాదకరం. ఆస్తమా వ్యాధితో బాధ పడేవారు వీలైనంతవరకు కలుషిత ప్రాంతాలకు దూరంగా ఉండటం మంచిది. తీసుకునే ఆహారం ద్వారా కూడా ఆస్తమా ప్రేరేపితమవుతుందని గుర్తుంచుకోవాలి. 
 
వైద్య నిపుణులు ఆస్తమా వ్యాధితో బాధ పడేవారు కొన్ని రకాల ఆహార పదార్థాల జోలికి ఎట్టి పరిస్థితులలోను వెళ్లకూడదని చెబుతున్నారు. పాల ఉత్పత్తులకు ఆస్తమాతో బాధ పడేవారు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. దగ్గు, తుమ్ములు లాంటి సాధారణమైన సమస్యలు పాల ఉత్పత్తులను తినే వారికి వస్తాయి. ఆస్తమాతో బాధపడేవారు జున్ను, పెరుగు, ఐస్ క్రీం లాంటి పాల పదార్థాలకు కూడా వీలైనంత దూరంగా ఉంటే మంచిది. 
 
ఆస్తమా బాధితులు సోయా ఉత్పత్తులు, గోధుమలు, సిట్రస్ పండ్లు, గుడ్లకు దూరంగా ఉండాలి. తీసుకునే ఆహారంలో ఎట్టి పరిస్థితులలలోను వీటిని తీసుకోకూడదు. ఆస్తమా బాధితులు ప్రాసెస్ చేసిన ఆహారానికి వీలైనంత దూరంగా ఉండాలి. ప్రాసెస్ చేసిన ఆహారంలో ఉండే పదార్థాలు అలర్జీని ఎక్కువగా రేకెత్తిస్తాయి. అందువలన ఇటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆస్తమా ఉన్నవారు ఫాస్ట్ ఫుడ్ అస్సలు తీసుకోకూడదు. ఆస్తమా బాధితులు ఆల్కహాల్ పానీయాలు, కాఫీ, టీ, సాస్ లకు దూరంగా ఉంటే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: