గ్యాస్ ట్రబుల్ తగ్గాలంటే ఏం చెయ్యాలో తెలుసా? ఏ చిట్కాలు పాటిస్తే గ్యాస్ ట్రబుల్ తగ్గుతుందో తెలుసా? వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో గ్యాస్ ట్రబుల్ వస్తుంది.. అయితే ఈ గ్యాస్ ట్రబుల్ రావడానికి ఈ కాలంలో చాలానే ఉన్నాయి. మనం తీసుకునే ఆహారం వల్లనే ఈ గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా వస్తుంది. 

 

అయితే ఈ గ్యాస్ ట్రబుల్ రావడానికి ఉప్పు కూడా ఒక కారణం అని చెప్తున్నారు పరిశోధకులు. ఉప్పులో ఉండే సోడియం మ‌న జీర్ణాశ‌యంలోని ప‌దార్థాలు జీర్ణ‌మ‌య్యేట‌ప్పుడు వాటిపై ప్ర‌భావం చూపిస్తుంద‌ట‌. దీంతో గ్యాస్ బాగా ఉత్ప‌త్తి అవుతుంద‌ని వారంటున్నారు. 

 

అలాగే ఫైబ‌ర్ ఉన్న ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల కూడా జీర్ణాశ‌యంలో గ్యాస్ బాగా పెరిగిపోతుంద‌ని వారు తేల్చారు. ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని ఇబ్బంది పెడుతున్న ఈ సమస్యను అదుపు చేయాలంటే ఉప్పు త‌క్కువ‌గా, ఫైబ‌ర్ ఒక మోస్తరుగా ఉన్న ప‌దార్థాల‌ను మాత్రమే తీసుకోవాల‌ని వారు సూచిస్తున్నారు. 

 

అంతేకాదు.. దీంతోపాటు అన్ని పోష‌కాల‌ను స‌మ‌పాళ్ల‌లో తీసుకోవ‌డం ద్వారా జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగు ప‌డుతుంద‌ని, దీంతో జీర్ణాశ‌యం ప‌రంగా వ‌చ్చే అన్ని స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. కానీ మన రాయలసీమ.. తెలంగాణాలో కొన్ని ప్రాంతాల్లో ఈ ఉప్పును ఎక్కువగా తిరుకుంటారు.. ఆఖరికి అన్నంలో కూడా ఈ ఉప్పుని ఎక్కువగా తింటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: