ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అరవింద్ గులేరియా నేతృత్వంలోని 15 వ ఆర్ధిక సంఘం పరిధిలోని ఆరోగ్య కమిటీ  ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులు. 

1)75 వ స్వాతంత్ర్య దినోత్సవం ను పురస్కరించుకొని 2021 లో  ఆరోగ్యాన్ని ప్రాదామిక హక్కుగా మార్చండి
2)ప్రజారోగ్యం మరియు ఆసుపత్రుల అంశం ను ప్రస్తుతం ఉన్న రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలో చేర్చాలి.
3)ప్రభుత్వ వైద్యులను  ఇతర విభాగాలతో పోల్చకుండా  సముచిత వేతనాలు, సౌకర్యాలు మరియు  రాయుతీలు ఇవ్వాలి.
4)దేశవ్యాప్తంగా ఇండియన్ ఆర్మీ మాదిరిగా షార్ట్ సర్వీస్ కమీషన్ రూపకల్పన చేసి దేశంలో వైద్యుల కోరత ఏక్కడ ఉంటే అక్కడకు స్పెషలిస్ట్లును పంపించాలి. 
5)డిఎన్ బి  కోర్సులను ప్రతి స్థాయి లో ప్రవేశపెట్టాలి. 
అందుకు ముందుకు వచ్చే వారికి ఆదాయపు పన్ను 80 జెజెఏ  సెక్షన్ కింద రాయుతీలు ఇవ్వాలి.
6)2025  నాటికి బడ్జెట్ లో ప్రభుత్వం  వైద్యం పే పెట్టే ఖర్చును ఇప్పుడున్న దానికి రెండింతలు చేయాలి(2.5%)
7)రాష్ట్రాలకు ప్రతిభ ఆదారిత ప్రోత్సహక నిదులు కేటాయించాలి. 
రాష్ట్రాలు వైద్య బడ్జెట్ లో పరిశోధనకు   2 శాతం కు తగ్గకుండా కేటాయించాలి.
8)ప్రాధమిక ఆరోగ్యం అత్యంత ప్రాదామ్య రంగం ఆదారంగా తయారు చెయ్యాలి. 
దేశంలోని ప్రాదామిక ఆరోగ్య కేంద్రాలను, సామాజిక ఆరోగ్య కేంద్రాలను, వెల్నెస్ సెంటర్లును, సబ్ సెంటర్లు ను 2011 జనాభా లెక్కల ఆదారంగా పెంచాలి. దీనికీ సుమారు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. 
9)దేశం లోని ప్రస్తుతం ఉన్న పడకల సంఖ్య ను దాదాపు రెట్టింపు(2 per 1000 people) చేయడానికి    దాదాపు 200 పడకల ఆసుపత్రులు 3000 కావాలి..దీనికోసం వచ్చే ఐదేళ్లలో  ప్రైవేటు రంగం తో కలసి పనిచెయ్యాలి.
10)2025 నాటికి యూజీ మరియు పీజీ సీట్లను సమానం చెయ్యాలి.
11)కమ్యూనిటి మెడిసిన్ మరియు ఫోరెన్సిక్ మెడిసిన్ సబ్జెక్టులను యూజీ విద్య స్థాయిలో అవసరం లేదు. 
12) ఎంబిబిఎస్  స్థాయి లోనే కొన్ని స్పేషాలిటి లు ప్రోత్సహించాలి. 
13)అనస్తీషీయా, గైనిక్, పీడియాట్రిక్స్ విభాగాలలో డిప్లొమా వైద్యులను కొనసాగిస్తూ వారి సేవలను మాద్యమిక స్థాయి ఆసుపత్రులలో వినియోగించు కోవాలి.
14)ఫ్యామిలీ మెడిసిన్ కు సరియైన ప్రాతినిధ్యం కల్పించాలి. జిల్లాలో ఇది ప్రోత్సహించాలి.  
కేంద్ర ఆరోగ్య శాఖ ఈ దిశగా విది విదానాలు రూపకల్పన చేయాలి. 
15)కాలేజీ లకు వారు సాదించే ఫిజీ సీట్లు మరియు ఉత్తీర్ణత ఆదారంగా గుర్తింపు మరియు రేటింగ్ ఇవ్వాలి. 
16)కేంద్ర ప్రభుత్వం  ఏకీకృత వాటా కింద రాష్ట్రాలకు ఇచ్చే 10 శాతం నిదులలో  మూడింట రోండొంతులు ప్రాధమిక ఆరోగ్యం పై ఖర్చు పెట్టాలి.
17)ప్రోత్సాహకాల వ్యవస్థను వైద్య ఆరోగ్య రంగంలో ప్రవేశపెట్టాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: