నూడుల్స్‌ వండడం చిటికెలో పని. అందుకే చాలామంది ఇళ్లల్లో వీటిని తరచూ తయారుచేయడం కనిపిస్తుంది. చైనా నుం డి దిగుమతి అయిన నూడుల్స్‌ కల్చర్‌ ఇప్పుడు మనదేశంలో ఎక్కువ‌గా విస్తరించింది. స్కూలుకెళ్లే పిల్లల దగ్గరి నుంచి కాలేజీకెళ్లే స్టూడెంట్స్‌ వరకూ అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. నూడుల్స్‌కు పెద్ద చరిత్రే ఉంది. రెండువేల నుంచి నాలుగువేల సంవత్సరాలకు పూర్వం నుంచే వీటి వాడకం ఉందని చరిత్రకారులు నిర్థారించారు. మ‌రి చిన్నా, పెద్దా అన్న తేడాలేకుండా అందరూ ఇష్టపడే ఈ నూడుల్స్‌ను తరచుగా తినడం మంచిదేనా? ఇప్పుడు చూద్దాం..!

 

సాధారణంగా ట్రాన్స్ అనే కొవ్వు పదార్థంతో నూడుల్స్‌ని తయారు చేస్తారట. ఇలా తయారైన నూడుల్స్‌ని తినడం వల్ల ఒంట్లో కొవ్వుశాతం పెరిగుతుంది. తద్వారా త్వరగా బరువు పెరుగుతారని తేలిసింది. ఇన్స్టెంట్ నూడుల్స్ పై ఆధారపడటం వలన మనం పోషకాహార లోపానికి గురవుతాము. నూడుల్స్ ని తీసుకోవడం వలన శరీరానికి విటమిన్ ఏ, సీ, డీ, కేల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ లు లభించే శాతం గణనీయంగా తగ్గుతుంది. గర్భధరించన వారు చాలా మంది మహిళలు ఇన్ స్టాంట్ నూడుల్స్ తినడం వల్ల అనేక మందికి గర్భస్రావంతో బాధపడ్డారు.

 

నూడుల్స్ ని వారానికి కనీసం రెండు సార్లు తీసుకునే మహిళలలో మెటబాలిక్ సిండ్రోమ్ కి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని అంటున్నారు నిపుణులు. నూడుల్స్ తయారీ సరిలేనపుడు అవి తింటే జీర్ణక్రియ సాఫీగా సాగక పొట్ట గడబిడకు గురై అజీర్ణం ఏర్పడుతుంది. నూడిల్స్ లో అధికంగా ఉప్పు ఉంటుంది. మోతాదుకు మించి ఉప్పు తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ మరియు గుండె వ్యాధులు, స్టోర్ మరియు కిడ్నీ డ్యామేజ్, మలబద్దకం వంటి సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: