సాధార‌ణంగా ప్రతి రోజూ కనీసం 8 గంటలు నిద్రపోవాలని వైద్యులు సలహా ఇస్తుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలన్నది వారి వాదన. నిద్రకు సమయం.. కాలం తెలీదు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. మ‌న జీవితంగా నిద్ర ఒక వ‌రం అని చెప్పాలి. మన మెదడుకు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నపుడే మనకు చక్కని నిద్ర పడుతుంది. అయితే  ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనంలో 8 గంటలు కాదు కదా.. అసలు నిద్రలేమి రాతులను యువత గడుపుతోంది. 

 

అయితే మ‌రి రాత్రిపూట పడుకున్న వెంటనే నిద్రపట్టాల‌న్నా, ప్ర‌శాంత‌మైన నిద్ర కావాల‌న్నా కొన్నిటికి దూరంగా ఉండాలి. మ‌రి అవేంటో ఓ లుక్కేస్తేపోలా..! ఎప్పుడూ కూడా నిద్రకుముందు కాఫీ, టీ, గ్రీన్‌టీలు తీసుకోకూడదు. ఎందుకంటే వీటివల్ల శరీరంలో కొన్ని కణాలు ఉత్తేజితమై నిద్రరాకుండా చేస్తుంటాయి.  పడుకునే ముందు సోషల్ నెట్ వర్క్స్, చాటింగ్ చేయడం మొత్తానికీ స్మార్ట్‌ఫోన్, వీడియోగేమ్స్, గ్యాడ్జెట్స్‌కి దూరంగా ఉండాలి. 

 

ఎందుకంటే.. వీటి ప్రభావం వ‌ల్ల‌ కళ్లల్లో తేమశాతం తగ్గిపోతుంది. దీంతో నిద్ర‌రాకుండా చేస్తాయి. పడకగదిలో లేత వర్ణంలో వెలిగే చిన్న బల్బులు ఉంటేనే మంచిది. కాంతి ఎక్కువగా ఉంటే మీ కనురెప్పలకు అలసటను కలిగిస్తుంది. అలాగే ఎక్కువగా ఆహారం తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది. సాధార‌ణంగా చాలామంది ఎక్కువ‌గా తింటే బాగా నిద్ర‌ప‌డుతుంద‌నుకుంటారు. కానీ, అలా కాకుండా తక్కువగా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే మంచి నిద్ర మీ సొంతమవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: