గ్రీన్ టీ  ప్ర‌పంచంలోనే అద్బుత‌మైన పానీయాల్లో ఒక‌టి.గ్రీన్ టీ అనగానే అందరు సాధారణంగా కొవ్వును కరిగించుకోటానికి వాడతారు అని తెలుసు. కానీ గ్రీన్ టీ వలన మన శరీరానికి చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి.   మిగిలిన టీల‌తో పోల్చితే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ‌గా ఉంటాయి.  ఈ యాంటీ ఆక్సిడెంట్లు  మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో ఎంతో దోహద పడతాయి. ఇది మ‌న జీవక్రియ‌ల‌ను కూడా వేగ‌వంతం చేస్తుంది. 

గ్రీన్‌టీ  వల్ల  కలిగే అనేక ఆరోగ్య  ప్ర‌యోజనాలు చూద్దాం.ర‌క్త‌పోటును అదుపులో ఉంచుతుంది.గ్రీన్ టీ చ‌ర్మాన్ని మృదువుగా, కాంతిమంతంగా మారుస్తుంది. ఇది న‌ల్ల‌మ‌చ్చ‌లు, మొటిమ‌లను త‌గ్గిస్తుంది. ఇందుకోసం రోజూ గ్రీన్ టీని తాగ‌డంతో పాటు టీ ఆకుల‌ను పేస్ట్ చేసి తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి ఈ ప్యాక్‌ని 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచుకొని ముఖం క‌డుక్కుంటే సరిపోతుంది.రెగ్యులర్ గా గ్రీన్ టీ తీసుకోటం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా సొంతం అంటున్నారు వైద్య నిపుణులు.


బ‌రువును కూడా  నియంత్రించవచ్చు .గ్రీన్ టీ తీసుకోవటం వల్ల మన  మెట‌బాలిజాన్ని వేగ‌వంతం చేసి కొవ్వుని తొందరగా  క‌రిగేలా చేస్తుంది. కొన్ని ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం, అటు వ్యాయామంతో పాటు రోజూ గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల బ‌రువు త్వ‌రగా త‌గ్గే వీలుంద‌ట‌ వైద్య నిపుణులు చెప్తున్నారు. 
రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రుస్తుంది.గ్రీన్ టీలోని ఈజీసీజీ వంటి క్యాట్చిన్లు మ‌న శ‌రీరంలో టీ సెల్స్ ఎక్కువ‌గా పెరిగేలా సాయ‌ప‌డ‌తాయ‌ట‌. 


మెద‌డు ప‌నితీరు మెరుగుప‌రుస్తుంది.గ్రీన్ టీలోని కెఫీన్ మ‌నల్ని యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. అంతేకాదు.. ఇది మ‌న మెద‌డు ప‌నితీరుని మెరుగుప‌రుస్తుంది. దీంతో ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. అంతేకాదు.. ఇది అడినోసిన్ అనే న్యూరోట్రాన్స్‌మిట‌ర్ పనిని బ్లాక్ చేసి మెద‌డు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: