మనం రోజు ఆహారంగా తీసుకొనే కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అస‌లు కూర‌గాయ‌లు, పండ్లు ప్ర‌కృతి మ‌న‌కు ఇచ్చే విలువైన సంపద‌. అయితే అతిగా ఏదైనా తీసుకుంటే అది మనకి హానిని కలిగించవచ్చు. ఇక ఎన్నో ఆరోగ్యప్ర‌యోజ‌నాలు చేకూర్చే కురగాయాలలో ఒక్కటి టమాట. టమాటాలను సూపర్ ఫుడ్ అంటారు. వాటిలో ఎన్నో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ ఉంటాయి. టమాటాను కూరగాయ కిందా, పండుగా కూడా భావించవచ్చు.

 

అయితే షుగ‌ర్ పేషెంట్స్ ట‌మాట తిన‌డం వ‌ల్ల ఏం అవుతుంది అన్న‌ది ఎప్పుడైనా ఆలోచించారా..? సాధార‌ణంగా టైప్‌ 2 డయాబెటీస్‌తో బాధపడేవారు చక్కని డైట్ తీసుకోవాలి. దీనివల్ల వారి ఆరోగ్యం బాగుపడడమే కాకుండా ఆరోగ్యం, బ్లడ్ షుగర్ లెవెల్స్ సరిగ్గా ఉంటాయి. అయితే వీరి డైట్‌లో టమాటాలు చేర్చుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మ‌రి అవేంటో చూడండి. డయాబెటీస్ పేషెంట్స్‌కి గైసమిక్ ఇండెక్స్ లెవల్స్ సరిగ్గా ఉండాలే చూసుకోవాలి. తీసుకునే ఆహారం వల్లే ఈ లెవల్స్ తగ్గడం పెరగడం జరుగుతుంటుంది. 

 

వాస్త‌వానికి ఈ లెవల్స్ తక్కువగా అంటే 55 కంటే మంచిది. టమాటల్లో ఈ లెవల్స్ 30 ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల టైప్‌ 2 డయాబెటీస్‌కి మంచిది. విటమిన్ సి, పోటాషియం, ఫొలేట్, విటమిన్ కె ఉండే టమాటను తినడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకే కాదు, క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలున్నవారికి కూడా మేలు జరుగుతుంది. ముఖ్యంగా.. టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్‌‌కి గుండె సంబంధిత సమస్యలు వచ్చే రిస్క్‌ని తగ్గిస్తాయి టమాటాలు. సో.. షుగ‌ర్ పేషెంట్స్ ఓవ‌ర్‌గా కాకుండా లిమిట్‌గా ట‌మాటాలు తీసుకోవ‌డం ఆరోగ్యానికి మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: