కరోనా వైరస్ జనాన్ని పీడుస్తోంది. కరోనా వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చైనా లో మొదలైన ఈ వ్యాధి అన్ని దేశాల్లో సంచరిస్తూ ప్రజలని వణికిస్తోంది. తాజాగా తెలిసిన విషయం ఏమిటి అంటే ఈ కరోనా వ్యాధి 20 దేశాల లో చేరింది నాటి వరకు. అలానే వ్యాధి వల్ల ఎందరో రోగులు ఆసుపత్రి లో చేరారు. కరోనా వ్యాధి మాత్రం ఓ కలంకలం సృష్టిస్తోంది. ఇది కేవలం చైనా నే కాకుండా మరో ఇరవై దేశాల లో కి రావడం ఒక చెడ్డ వార్త అనే చెప్పాలి.
 
ఇలా అన్నీ దేశాల లో కి చేరుతోంది. మన భారత దేశం లో కూడా ఈ కరోన వ్యాధి సోకడం ప్రారంభం జరిగింది. తాజాగా మన భారత దేశం లో రెండు కేసులు నమోదు అయ్యాయి. అయితే ఒక విధ్యార్ధి వూహన్ లో తన చదువు ని కొనసాగిస్తోంది.
 
కాగా తను అక్కడ వ్యాధి ని చూసి భయము తో స్వస్థలం కి చేరుకుంది. కేరళ కావడం చేత అక్కడకి వెళ్ళింది. ఇంటికి చేరుకున్నాక ఆమె రక్త కణాలంజ్ సేకరించి చూడగా పూణె లో నేషనల్ ఇన్స్టుట్యూట్ ఆఫ్ వైరాలజీ వారు ఈమె రక్త కణాలని పరీక్షించారు. దీని ద్వారా ఈమె కి కరోన సోకినట్లు బయట పడడం జరిగింది.
 
అలానే ఇటీవలె చైనా నుండి వచ్చిన మరో మనిషి కి కూడా కరోనా వైరస్ సోకినట్లు నమోదు అయ్యింది. చైనా లో అయితే కరోనా 304 కి చేరిన మృతుల సంఖ్య. అలానే 2590 మంది కరోనా బాధితులు అయ్యారు. కట్టడి  చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇలా కరోనా వ్యాధి పై తగిన చర్యలని పాటిస్తూ చికిత్స ని అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: