మీరు రాత్రుళ్ళు సరిగా నిద్రపట్టడం లేదా, మీకున్న టెన్సన్స్ తో సరిగా నిద్రపోలేక పోతున్నారా, మీరు నిద్ర లేమి సమస్యతో బాధ పడుతున్నారా.. అయితే ఇది మీకోసమే. సాధారణంగా మనకు నిద్ర పట్టకుండా ఉండడానికి వేడి వేడి టీ తాగుతాం, కానీ ఈ టీ తాగితే మనకు చక్కటి నిద్ర పట్టడం ఖాయం. అదే అరటి పండు తో చేసే బనానా టీ.

 

ఈ టీ తాగడం వలన చక్కటి నిద్ర పడుతుందని, మీరు నిద్ర మాత్రలు వాడం కన్నా ఈ టీ అలవాటు చేసుకోవడం ఉత్తమమని పరిశోధకులు తెలుపుతున్నారు. ఈ టీ తయారు చేయడానికి మీరు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. మీరు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత రిలాక్స్ గా ఒక పది నిమిషాలు కేటాయిస్తే చాలు. ఇప్పుడు ఈ టీ ఎలా చేయాలో తెలుసుకుందాం.

 

ఈ టీ తయారు చేయడానికి మీకు ప్రత్యేక దినుసులు ఏమి అవసరం లేదు కేవలం అరటి పండు, కాస్త నీళ్లు, దాల్చిన చెక్క ఉంటే సరిపోతుంది.

 

ఒక బనానా ను తీసుకొని దానిని ముందుగా శుబ్రా పరచుకొండి, బనానా కొనలను ఇరువైపులా అంటే పైన కోన, కింద కొన కత్తిరించేయండి. ఇప్పుడు ఒక పాత్ర్ర తీసుకొని దానిలో ఒక గ్లాస్ నీళ్లు పోసి, ముందుగా మనం కత్తిరించి పెట్టుకున్న బనానాను అందులో వేసి ఒక పది నిమిషాల పాటు బాగా మారగా పెట్టండి.

 

ఇప్పుడు బాగా మరిగించిన తర్వాత ఆ పాత్రను తీసుకొని దానిని వడకట్టి ఆ నీరు ను వేరు చేయండి. బనానా మామూలుగానే తీయగా ఉంటుంది కనుక మనం ప్రత్యేకంగా చక్కర, బెల్లం లాంటి  వాటిని కలుపుకోవాల్సిన అవసరం లేదు.

 

ఈ మిశ్రమం ఉడికేటప్పుడే దాల్చిన చెక్క కూడా మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకున్నా దాని పొడి నైనా  మరిగించిన నీటిలో కలుపు కోవచ్చు అది మీ ఇష్టం. బనానాలో సహజం గానే ఎన్నో మూలకాలు ఉండడం వలన అవి మీకు శక్తీ తో పాటు, అందులో వుండే అమైనో ఆమ్లాల వల్ల మీకు చక్కటి నిద్ర కూడా పడుతుంది .

 

ఈ చిన్న చిట్కా వాడడం వలన మీరు నిద్ర లేమి సమస్య నుండి దూరం కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ఈ చిట్కా ప్రయత్నించి చూడండి, హాయిగా నిద్ర పొండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: