ఇప్పటి యువత, ఎక్కువ మంది మగవారు వైన్ లను బాగా తీసుకుంటూవుంటారు. ఇటీవల కాలంలో అబ్బాయిలే కాకా.. అమ్మాయిలు కూడా మందును తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు వీరందరిని షాక్ తినే వార్తను అధ్యయనం చేసిన పరిశోధకులు వెల్లడించారు.
మద్యం అతిగా సేవించే వారి మాటతడబడటం, చూపు మసకబారడం చూస్తుంటాం. అయితే ఆల్కహాల్‌ మెదడు వయసు పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది నిర్ధిష్టంగా వెల్లడి కాని క్రమంలో తాజా అథ్యయనం సరికొత్త అంశాలను ముందుకు తెచ్చింది. 


మద్యం తీసుకునే మోతాదును బట్టి మెదడు వయసు పెరుగుతున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. నిత్యం మద్యం సేవించే 45 నుంచి 81 సంవత్సరాల మధ్య వయసున్న 11,600 మంది పై జరిపిన పరిశోధనలో ఈ వివరాలు వెలుగుచూశాయి. రోజూ ఒక బీరు లేదా గ్లాస్‌ వైన్‌ ను మించి అదనంగా తీసుకునే ప్రతి గ్రాముతో వారి మెదడు క్రమంగా కుచించుకు పోతున్నట్టు ఈ అధ్యయనం తేల్చింది.


రోజులో అదనంగా తీసుకునే ప్రతి గ్రాము ఆల్కహాల్‌ తో వారి మెదడు రోజున్నరతో సమానమైన 0.02 సంవత్సరాల వయసు మీరుతుందని పరిశోధకులు గుర్తించారు. మద్యపానం, పొగతాగడం మెదడు వయసు మీరడానికి  దారి తీస్తుందనేది తొలిసారిగా కెక్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఆఫ్‌ సదరన్‌ కాలిపోర్నియా పరిశోధకులు నిర్ధారించారు. 


రోజూ మద్యం సేవించే వారి మెదడు మద్యం తక్కువగా లేదా అసలు ముట్టని వారి మెదడు వయసుల మధ్య వ్యత్యాసాన్ని ఎంఆర్‌ఐ ద్వారా పరిశోధకులు పరిశీలించారు. ఒక గ్లాస్‌ వైన్‌, పింట్‌ బీరుకు మించి అదనంగా తీసుకునే ప్రతి గ్రాము ద్వారా మద్యపాన ప్రియుల మెదడు 0.02 సంవత్సరాలు వయసు మీరుతున్నట్టు వారు లెక్కగట్టారు. పొగ తాగే వారిలోనూ ఇదే ఫలితాలు కనిపించాయని పరిశోధకులు ఈ అధ్యనంలో పేర్కొన్నారు. కాబట్టి మద్యం తీసుకునే వారు జాగ్రత్తగా ఉండండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: