మారుముాల గ్రామీణ ప్రాంతలలో ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించటం చాలా ఆనందం ఉందని లయన్స్ క్లబ్ అద్యక్షులు సిహెచ్. వి.వి.కుటుంబరాజు తెలిపారు. క్రిష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని పాములలంక గ్రామములో లయన్స్ క్లబ్ ఆప్ ఉయ్యూరు మరియు హోప్ ఆర్దోహాస్పటల్ ఆద్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా లయన్స్ క్లబ్ అద్యక్షులు కుటుంబరాజు  ప్రారంభించారు. హోప్ ఆస్పటల్ వైద్యులు డాక్టర్ జాన్ డేవిడ్ వైద్య పరిక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసారు.

ఈ క్యాంప్ నందు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ వినీల్, డాక్టర్ ఎస. ఆముాల్య , ఉయ్యూరు కెపిసి  దంత వైద్య శాల వైద్యులు డాక్టర్ కైలాష్ కుమార్, డాక్టర్ పుార్ణిమ  దంత వైద్య పరిక్షలు నిర్వహించి మందులు అందచేసారు తమ వైద్య శాలకు వచ్చి చికిత్స చేపించుకునే పాముల లంక గ్రామములోని ప్రజలుకు 50% రాయితీ తో వైద్యం చేస్తాము అని తెలియచేసారు అలాగే డాక్టర్ జాన్ డేవిడ్ మాట్లాడుతూ తన తండ్రి  అయిన బ్రదర్ ఇమ్మానియల్ కి ఎంతో అవినాభావ సంభంధాలుండేవాని కనక ఆయన పేరుతో ఈ గ్రామానికి త్రాగు నీరు కొరకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాను అని హామి ఇచ్చారు.

ఈ ప్లాంట్ ఏర్పాటులో కుటంబరాజు, డాక్టర్ పుార్ణిమ తమ వంతు సహకారం చేస్తామని తెలిపారు. వాటర్ ప్లాంట్ కి గ్రామస్తులు క్రుతజ్నతలు తెలిపారు. ఈ క్యాంప్ నందు సుమారు రెండు వందలమందికి వైద్య సేవలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయ కర్తగా న్యాయవాది చంటిబాబు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో లయన్స్ కార్యదర్శి సత్య కిషోర్ ,కోశాధికారి నల్లా శ్రీనివాస్ , డి. గణేష్ ,నెల్లి రాంబాబు ,వి।క్రిష్ణ ప్రసాద్ ,దళిత ఐక్య వేదిక వ్యవస్థాపకులు పినమాల నాగ కుమార్ ,సోలే నాగ రాజు,పొత్తురు రవి,సోలే ధర్మారావు ,తుామాటి నాగరాజు ,పాముల నాగరాజు ,శీలం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
 

 

   

మరింత సమాచారం తెలుసుకోండి: