ముల్లును ముల్లుతోనే తీయాలంటారు.. కొన్ని రోగాలను విషం తోనే నయం చేస్తారు. అలా చికిత్సకు పనికొచ్చే విషాల్లో తేలు విషం ఒకటి. ఈ తేలు విషం కొన్ని రోగాలకు బాగా పని చేస్తుందట. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి చికిత్సలోనూ తేలు విషయం ఉపయోగపడుతుందట.

 

తేలు విషంతో తయారైన మందును తగిన పరిమాణంలో తీసుకుంటే.. కీళ్ల సంబంధిత వ్యాధులన్ని నయమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు కూడా ధ్రువీకరించాయట. అయితే ఈ తేలు విషం సేకరించడం చాలా కష్టం. అంతే కాదు.. ఒక తేలు వద్ద దొరికే విషం పరిమాణం కూడా చాలా స్వల్పం.

 

అందుకే ఈ తేలు విషానికి రేటు ఎక్కువట. మార్కెట్లో ఒక్క గ్రాము తేలు విషం ధర 80 వేల రూపాయలు ఉంటుందట. అంటే కేజీ తేలు విషం దాదాపు 80 కోట్ల రూపాయలన్నమాట. కేవలం కీళ్ల నోప్పుల వ్యాధులకే కాకుండా ఇంకా అనేక చికిత్సల్లో తేలు విషాన్ని వాడుతారట. అందుకే ఈ తేలు విషానికి అంత డిమాండ్.

మరింత సమాచారం తెలుసుకోండి: