అరోగ్యంగా ఉండడానికి పండ్లు , కూరగాయలు తినడం మంచిదని అందరికి తెలిసిందే.. వాటితో అరోగ్యకరమైన ప్రయోజనాలు అనేకం. చాలామంది తమ స్తోమతను బట్టి, అందుబాటులో ఉన్న పండ్లను కొనుక్కుని తింటుంటారు. అయితే పండ్లు తింటున్నాం కానీ వాటి గురించి చాలా విష‌యాలు మ‌న‌కు తెలియ‌దు. పండ్లు తినేప్పుడు సాధారణంగా చాలామంది కట్ చేసి ఉప్పు చల్లుకుని తింటారు. ఎక్కువగా పుచ్చకాయ, జామకాయ, మామిడికాయ‌ విషయంలో ఇలా చేస్తాం. కాని కొందరు అన్నిరకాల పండ్లను అలాగే తింటారనుకోంది. నిజమే పండ్లపై ఉప్పు చల్లుకుంటే రుచి పెరుగుతుంది.

 

అయితే దానివల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పండ్ల ముక్కలపై లైట్ గా ఉప్పు చల్లుకొని తినడం ద్వారా అందులో బ్యాక్టీరియాను నశింప చేసుకోవచ్చు. సిట్రస్ కలిగిన  పండ్లలో ఉప్పు చేర్చుకొని తీసుకోవడం ద్వారా ఉదరంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలను నిరోధించవచ్చు. అజీర్తి సమస్యలను దూరం చేసుకోవచ్చు. జామకాయ మీద కొద్దిగా ఉప్పు చల్లుకుని తింటే దంతాలకు మేలు జరుగుతుంది. నోట్లో బ్యాక్టీరియా చచ్చిపోతుంది.


 
కాని, ఇది మధుమేహ వ్యాధిగ్రస్థులు ఇలా పండ్లపై ఉప్పుచల్లుకొని తీసుకోకూడదు. పండ్లపై చిటికెడు మోతాదులో ఉప్పు చేర్చుకొంటే పర్వాలేదు కాని అదే ఉప్పుకు స్పూన్ల పరిమాణంలో తీసుకొంటే మాత్రం గుండె జబ్బులు  కిడ్నీ వ్యాధులు తప్పనిసరిఅని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే సాధార‌ణ వ్య‌క్తులు కూడా ఎప్పుడో తప్పితే రోజూ పండ్లపై ఉప్పు వేసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంట.. మన బాడీకి ఉప్పు అవసరమే. కానీ అతి తక్కువ మాత్రమే కావాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: