సాధార‌ణంగా ఎవ‌రైనా అర‌టిపండు తిని.. తొక్క పారేస్తుంటారు. కాని, ఇక నుంచి అలా చేయ‌కండి సుమీ! ఎందుకంటే పండుకంటే దానితోక్క‌లోనే చాలా ప్రయోజనాలున్నాయి. అరటిపండు తొక్కలో అధిక శాతంలో విటమిన్లు, ఖనిజాలు, బి6 , బీ12, ఏ, సి విటమిన్లు, మాంగనీస్, పొటాషియం, అరిగే పీచు పదార్ధాలు, ప్రొటీన్లు, మెగ్నీషియం, తదితర ప్రోటీన్లు ఉంటాయి. డిప్రెషన్‌తో బాధపడుతున్న వారు రోజుకు రెండు అరటి పండు తొక్కలను తినాలి. దీంతో వాటిలో ఉండే ఔషధ గుణాలు మన శరీరంలో సెరటోనిన్ స్థాయిలను పెంచుతాయి. సెరటోనిన్ పెరిగితే డిప్రెషన్ తగ్గుతుంది.

 

వయసు పెరిగే కొద్దీ కంటి చూపు మందగిస్తుంది. అరటి పండు తొక్క లోపలి భాగాన్ని తినడం వల్ల దృష్టి సంబంధ సమస్యలు తగ్గుతాయి. అరటి తొక్కలో ల్యూటిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అతినీలలోహిత కిరణాల ప్రభావం నుంచి కంటిని కాపాడుతుంది. అంతేకాదు నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. నొప్పి ఉన్నచోట అరటి తొక్కను రుద్దాలి. కాసేపట్లోనే నొప్పి మటు మాయం అవుతుంది. అరటికన్నా అరటితొక్కలో ఎక్కువగా జీర్ణం చేసుకునే పీచు పదార్థాలు ఉంటాయి.

 

అందువల్ల కొవ్వుపదార్థాల స్థాయి తగ్గి, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సహాయపడుతుంది. కొలెస్ట్రాల్‌ కరిగిపోవడంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అరటితొక్క లోపలి వైపు భాగంతో ఒక నిముషంపాటు దంతాలపైన ఒక వారం రోజులపాటు, ప్రతిరోజూ రుద్దండి. ఇలా చేయటంవలన మీ దంతాలు తెల్లగా మెరుస్తాయి. అరటిపండు తొక్క చ‌ర్మాన్ని ర‌క్షిస్తుంది. అంతేకాదు యాంటీ ఏజింగ్ గుణాలు కూడా అర‌టి పండు తొక్క‌లో ఉన్నాయి. దీని వ‌ల్ల వృద్ధాప్యం కార‌ణంగా వ‌చ్చే ముడ‌త‌లు త‌గ్గిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: