ఇటీవ‌ల కాలంలో ప్ర‌పంచం మొత్తంలో కిడ్నీ వ్యాధులు చాలా వేగంగా పెరుగుతున్నాయ‌న్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. అత్యాధునిక వైద్య పద్ధతులు ఎన్ని వచ్చినా ఆందోళన కలిగిండే వ్యాధులు కొన్ని ఉన్నాయి. వాటిలో కిడ్నీ సమస్య ఒకటి. కిడ్నీ వ్యాధులకు అనేక కారణాలు ఉన్నా.. ప్రధానంగా జీవన విధానంలో మార్పులు, నొప్పుల మాత్రలు ఎక్కువగా వాడటం, గాలి, నీరు కాలుష్యం మొదలైనవి ప్రధానం. మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపడంలో కిడ్నీలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.

 

అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నంత కాలం మనకు ఎలాంటి సమస్యలూ రావు. కానీ కిడ్నీలు పాడైతే మాత్రం మనకు అనేక అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. వీటి ద్వారా మ‌నం కిడ్నీల స‌మ‌స్య వ‌చ్చిన‌ట్టు గుర్తించ‌వ‌చ్చు. మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి. కళ్లు ఉబ్బడం.. శరీరంలోంచి మనకు అవసరమైన ప్రోటీన్లు మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయి. దీంతో ప్రోటీన్ల లోపం తలెత్తి కళ్ల చుట్టూ ఉబ్బుతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటే విటమిన్ డీని సంగ్రహిస్తాయి. దీనివల్ల ఎముకలు బలంగా మారడమే కాకుండా ఎరిత్రోపొయెటిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది.

 

అయితే కిడ్నీ సమస్యలున్నవారికి ఈ హార్మోన్ విడుదల కాదు. కాబట్టి ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోయి కండరాలు, మొదడు బలహీనమవుతాయి. కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం వల్ల రక్తంలో చేరే వ్యర్థాలు.. బయటికి విసర్జించబడవు. ఈ ప్రభావం శరీర భాగాలపై పడి నిద్రలేమి సమస్య ఎదురవుతుంది. మూత్రం రంగు మారినా, మూత్రంలో అసాధారణ మార్పులు కనిపించినా కిడ్నీ సమస్య ఉందని భావించాలి. కిడ్నీలు తీవ్రంగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి తగ్గుతుంది. రక్తంలోని వ్యర్థాల కారణంగా వికారం, వాంతులు లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఆకలి లేకపోవడంతో బరువు తగ్గుతారు.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: