భోజనం చేయ‌క ముందు.. చేసిన తర్వాత ఏం చేయాలి ? ఏం చేయకూడదు ? అనే ప్రశ్నలు అందరినీ వేధిస్తుంటాయి. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెబుతూ మరింత డైలమాలో పడేస్తుంటారు. అయితే ఆహారం తీసుకోక ముందు, తీసుకున్న త‌ర్వాత‌ అలవాటులో పొరపాటుగా చేసే కొన్ని పనులు ఆరోగ్యానికి హానికరం. మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి మ‌రి. భోజనం చేసేముందు కానీ చేశాక కానీ ఆబగా పండ్లు తినకూడదు. ఇలా తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరిగే అవ‌కాశాలు ఎక్కువ‌.

 

భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. దీనివల్ల రక్తం అంతా చేతులకి కళ్లకి మొత్తం ఒంటికి పాకి, పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణ ప్రక్రియని నెమ్మది చేస్తుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ సామర్ధ్యం తగ్గిపోతుంది. భోజనం చేసిన తర్వాత చాలా మందికి స్వీట్, ఐస్ క్రీమ్, కేక్ లాంటివి తినాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది మంచి పద్ధతి కాదని చెబుతున్నారు. వీటిలో కాలరీలు ఎక్కువ ఉంటాయి. దాంతో కొవ్వు కూడా బాగా పెరిగిపోతుంది. భోజనం చేసిన వెంటనే పడుకుంటే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక గ్యాస్ర్టిక్ ట్రబుల్ తోపాటు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలుంటాయి. 

 

మాములుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా నిద్ర వస్తుంది. మరీ ఎక్కవగా నిద్ర వస్తుంటే.. 15 నుంచి 20 నిముషాల కంటే ఎక్కువగా పడుకోకూడదు. అలాగే చాలా మంది తిన్నవెంటనే నడుస్తూ ఉంటారు. క‌నీసం ఒక‌ అరగంట, గంట తర్వాత నడవడం వల్ల జీర్ణవ్యవస్థ బాగుంటుంది. భోజనం పూర్తైన తర్వాత తిన్న ప్లేటు ముందు నుంచి కదలరు. అలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. భోజనం చేయడం పూర్తవ్వగానే అక్కడి నుంచి లేవాలని చెబుతున్నారు. అలానే ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కొవ్వు పేరుకుపోయే అవకాశం ఎక్కువ‌.

మరింత సమాచారం తెలుసుకోండి: