సాధార‌ణంగా బాదం పాలు ఎవ‌రైనా ఇష్ట‌ప‌డ‌తారు. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి కాబ‌ట్టి. టేస్టే కాదు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా బాదం పాల‌లో మెండుగానే ఉన్నాయి. బాదం పప్పు శరీర ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి మంచిది. పోషకాహారంగానే గాకుండా కొన్ని అనారోగ్యాలను పోగొట్టడంలో కూడా బాదం పనికొస్తుంది. బాదంను అలాగే వాడే కంటే, ఒక పూట నీళ్ళలో బాగా నానబెట్టి, పైన ఉన్న పొరలాంటి తొక్కను తీసేసి, ముద్దగా నూరి వాడడం మంచిది. ఇలా చేయడం వల్ల బాదం పప్పు సరిగ్గా అరిగి శరీరానికి వంటబడుతుంది.

 

బాదంలో కొలెస్ట్రాల్ ఉండదు లేదా ఇందులో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్స్ గురించి పెద్దగా పట్టించుకోవల్సిన అవసరం లేదు. అందుకే మీ ఆరోగ్యానికి ఇవి చాలా మేలు చేస్తాయి. బాదం మిల్క్ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదం పాలలో గ్లిజమిక్ ఇండెక్స్ అధికంగా ఉండటం వల్ల శరీరంలో ఫ్యాట్ చేరకుండా, బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేసి డయాబెటిక్ ను కంట్రోల్ చేస్తుంది. అలాగే బాదం పాలలో ఉండే విటమిన్ ఇ మరియు యాంటీఆక్సిడెంట్స్ స్కిన్ హెల్తీగా మార్చుతుంది. 

 

ఇతర చర్మ సమస్యలను కూడా నివారిస్తుంది. బాదం పాలు త్రాగడం వల్ల మెదడకు కావల్సిన శక్తిని పెంచుతుంది . కాబట్టి, బాదం మిల్క్ ను నిద్రించే ముందు త్రాగడం మంచిది. బాదం పాలలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ శక్తిని మెరుగుపరచడంతో పాటు, మలబద్దాన్ని నివారిస్తుంది. అదే విధంగా బాదం పాలు కండరాలు బలోపేతం అవుతాయి. నొప్పులను నివారిస్తాయి. ఎముకలను బలపరుస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇలా ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్న బాదం తాగ‌డం చాలా మంచిది.

 
 
 


 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: