నేటి యువ‌త‌, పిల్ల‌లు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డేది తినేది పిజ్జాలు, బ‌ర్గ‌ర్లు, నూడ‌ల్స్ వంటి ఫాస్ట్ ఫుడ్స్‌నే. మన ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఫాస్ట్ ఫుడ్స్ ఏ విధంగా కూడా ఉపయోగకరంగా ఉండవని తెలిసి కూడా.. ఫాస్ట్ ఫుడ్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోలేకపోతున్నాము. పల్లె, పట్నం అనే తేడా లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు. ఏ ఏరియా చూసినా, ఏ గల్లీకి వెళ్లిన ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు తప్పక దర్శనమిస్తాయి. అయితే ఈ విష‌యం తెలిస్తే ఖ‌చ్చితంగా ఫాస్ట్ ఫుడ్స్‌ను మానేయ‌డానికి ట్రై చేస్తారు.

 

హెల్తీ డైట్ అనేది కేవలం గుండెకు, బ్రెయిన్‌కు మాత్రమే కాదు స్పెర్మ్(వీర్యం)కు కూడా మంచిదని రీసెర్చర్స్ చెబుతున్నారు. 19ఏళ్ల సగటు వయస్సున్న 2వేల 900మందిపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చేపలు, చికెన్, కూరగాయలు, పండ్లు, నీళ్లు ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకునే వారిలో స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా కనిపించిందట. అవి కాకుండా పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, బీఫ్స్, స్నాక్స్, పాలిష్ చేసిన బియ్యం, షుగరీ బేవరేజెస్, స్వీట్స్ తినే వారిలో తక్కువగా ఉన్నట్లు తేలింది. 

 

 హెల్తీ డైట్ తీసుకునే వారిలో వయస్సుతో సంబంధం లేకుండా వీర్యకణాల వృద్ధి అవుతున్నట్లు తేలాయి. అయితే ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నా వారిలో స్పెర్మ్ కౌంట్  తక్కువ ఉండటం.. దాని వ‌ల్ల‌ భాగస్వామి ప్రెగ్నెన్సీ అవడం ఆలస్యం అవుతుంది. కొన్ని సార్లు గర్భం దాల్చడం కూడా అనుమానమే. అందుకే ఫాస్ట్ ఫుడ్ దూరంగా ఉండ‌మంటున్నారు నిపుణులు. అలాగే ఫాస్ట్ ఫుడ్ ని తరచూ తీసుకోవడం వల్ల కోలోరెక్టాల్ క్యాన్సర్ తో పాటు ప్రేగు క్యాన్సర్ కి గురయ్యే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: