మీ జుట్టు రోజూ రాలిపోతుందా...? తలపై జుట్టంతా పలుచబడిందా...? అయితే బట్టతల సమస్య వచ్చే అవకాశం ఉంది. వర్క్ టెన్షన్లు, విశ్రాంతి లేకపోవడం, తీసుకునే ఆహారం వలన జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా జుట్టు రాలే సమస్య నుండి పూర్తిగా బయటపడవచ్చు. మర్రి ఊడల్ని పేస్టులా చేసి తలకు పట్టించి రెండు గంటల తరువాత స్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. 
 
నల్లటి మిరియాలను, నిమ్మకాయ గింజలను తగినంత నీరు కలిపి మెత్తగా నూరి తలకు పట్టిస్తే జుట్టు రాలడం ఆగిపోవడంతో పాటు జుట్టు నల్లగా మారుతుంది. మగ్గిన అరటికాయను నలిపి అందులో కొన్ని చుక్కలు ఆల్మండ్ నూనె కలిపి జుట్టుకు మసాజ్ చేస్తే జుట్టు రాలడం ఆగిపోతుంది. ఆరంజ్ రసంలో కొన్ని చుక్కలు చందనపు నూనె, ఒక టేబుల్ స్పూన్ తేనెను కలిపి షాంపూ స్నానం తరువాత జుట్టును కడుక్కుంటే జుట్టు రాలడం ఆగిపోతుంది. 
 
నువ్వుల నూనెను వెంట్రుకలకు పట్టించి గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. ఉసిరి రసం లేదా చేమ దుంపల రసం తలకు రాసినా జుట్టు రాలడం ఆగిపోతుంది. ఒక స్పూను నిమ్మరసం నాలుగు టీ స్పూన్ల పాలలో కలిపి తలకు పట్టిస్తే జుట్టు రాలడం ఆగిపోతుంది. ఈ చిట్కాలు పాటించినా జుట్టు రాలడం ఆగకపోతే డాక్టర్ ను సంప్రదించి జుట్టు రాలడానికి కారణాలను తెలుసుకొని చికిత్స చేయించుకోవడం మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: