మనిషికి తిండి.. నిద్ర.. బట్ట ఎలా అయితే అవసరమో రోజుకు కాస్త నవ్వు కూడా అంతే అవసరం. నవ్వడం వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం అని చెప్తున్నారు వైద్య నిపుణులు. నవ్వడం వల్ల మరో నాలుగేళ్లు ఎక్కువ బతుకుతాం అని అంటున్నారు. ఇకపోతే ఈ నవ్వు రోజుకు ఎన్ని సార్లు నవ్వితే ఎన్ని ప్రయోజనాలు.. ఎంత లావు తగ్గుతారు అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

సైంటిస్టులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజూకు 100 సార్లు గ‌న‌క న‌వ్వితే 15 నిమిషాలు సైకిల్ తొక్కడంతో స‌మాన‌మ‌ట‌. అలాగే 10 నిమిషాలు రోయింగ్ మెషీన్‌పై వ్యాయామం చేసిన దాంతో ఆ 100 సార్లు నవ్వు స‌మాన‌మ‌ట‌. అలాగే అది 30 నిమిషాల పాటు వాకింగ్ చేసిన దానికి, 15 నిమిషాల పాటు రన్నింగ్ చేసే దానికి సమానం అని అంటున్నారు వైద్య నిపుణులు. 

 

దీంతో కేవలం నవ్వు వల్లే దాదాపుగా 100 నుండి 150 క్యాల‌రీల వ‌ర‌కు ఖర్చు అవుతాయి అని పరిశోధకులు తెలిపారు. కాగా ఇలా ప్రతిరోజు 100 సార్లు గ‌న‌క నవ్వితే వ్యాయామం చెయ్యకుండానే లావు తగ్గిపోతారు అని సైంటిస్టులు చెబుతున్నారు. న‌వ్వ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి వ్యాయామం అవుతుంద‌ని, దాంతో అధిక బ‌రువు, డ‌యాబెటిస్, గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని సైంటిస్టులు చెప్తున్నారు. మరి మీరుకూడా ఒక పది రోజులు పాటు రోజుకు వందసార్లు నవ్వి బరువు తగ్గారా లేదా? అనేది చెక్ చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: