ప్రస్తుతం అనేకమందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం. మలబద్దకం అంటే విరేచనం సాఫీగా సాగకపోవడమే. దీనికి మారిన జీవన విధానం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, తీవ్ర మానసిక ఒత్తిడి మొదలైనవి కారణాలు. అయితే మలబద్ధకాన్ని తేలిక గా తీసుకుంటే.. అది మరిన్ని వ్యాధులు సోకడానికి మూల కారణమవుతుంది. మలబద్దకం అనేది కేవలం ప్రేగు సమస్యలతోనే ముడిపడి ఉండదు. ఇది కూడా కడుపులో ఉబ్బరమును, వికారమును మరియు నొప్పిని కలుగజేయడానికి కారణమవుతుంది.

 

మ‌రి దీనికి చెక్ పెట్టాలంటే.. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే స‌రిపోతుంది. పీచు పదార్థాలు అధికంగా ఉండే అరటిపండ్లు, పైన్‌యా పిల్‌, బత్తాయి, సపోటా వంటి పళ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు ప్రతిరోజూ తీసుకుంటే మల విసర్జన సాఫీగా అవుతుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే ఒకటీ రెండు గ్లాసుల నీరు తాగాలి. మ‌రియు ప్రతిసారి భోజనం చేయడానికి అర‌గంట ముందు ఆ తర్వాత కూడా నీరు తాగాలి.

 

అదేవిధంగా, ఆముదం నూనెలో ఒక కప్పు నారింజ రసం కలపండి దీనని వెంటనే తాగండి. రోజుకోసారి తీసుకోవడం వల్ల అద్భుత ఫలితాలుంటాయి. నారింజ రసంలోని ఫైబర్ మలాన్ని మృదువుగా చేయడంలో, మరియు ఆముదం మలవిసర్జనను సజావుగా సాగించడంలో సహాయపడుతాయి. క్రమంగా మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఫాస్ట్‌ ఫుడ్స్‌, మసాలాలు, వేపుళ్లు మానేయాలి. నిలువ ఉంచిన పచ్చళ్లు తినడం మానేయాలి. అప్పుడే మ‌ల‌బ‌ద్ధ‌క స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌గ‌లం.

మరింత సమాచారం తెలుసుకోండి: