వెల్లుల్లి.. దీని రుచి ప్ర‌తి ఒక్క‌రూ చూసే ఉంటారు. ఇది వంటకాలకు రుచిని, గుమగుమలను తెస్తుంది. ఆరోగ్య రక్షణలో వెల్లుల్లి పాత్ర ఎంతో విశిష్టమైనది.  వైద్య పరంగానూ వెల్లుల్లి అనేక రుగ్మతలకి దివ్యౌషధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎన్నో పోషకాల గణి వెల్లుల్లి అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. వెల్లుల్లి చర్మ సౌదర్యాన్ని కాపాడటంలో క్రీయాశీలంగా పనిచేస్తుంది. అయితే వెల్లుల్లి కేవ‌లం ఆరోగ్య‌ప‌రంగా, సౌంద‌ర్య‌ప‌రంగానే కాకుండా అనేక విధాలుగా ఉప‌యోగించుకోవ‌చ్చు.

 

సాధార‌ణంగా చాలా మందికి చెవి సంబంధ స‌మ‌స్య‌లు అప్పుడ‌ప్పుడు ఎదుర‌వుతుంటాయి. కొంద‌రికి చెవి అంత‌ర్భాగంలో ఇన్ఫెక్ష‌న్ రావ‌డం వ‌ల్ల చెవి సంబంధ వ్యాధులు వ‌స్తాయి. ఇక‌ మ‌రికొంద‌రికైతే చెవిలో హోరు, ఏదో తెలియని శబ్దంతో ఎంతో బాధ‌ను అనుభ‌విస్తారు. ఈ క్ర‌మంలో ఇయ‌ర్ బ‌డ్స్‌ను చెవిలో పెడితే స‌మ‌స్య మ‌రింత తీవ్ర‌త అవుతుంది. అలాంట‌ప్పుడు వెల్లుల్లి ర‌సం ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. అందుకు ముందుగా వెల్లుల్లి రెబ్బ‌ల్ని తీసుకుని వాటి నుంచి ర‌సం తీయాలి. ఆ ర‌సానికి కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి.. దూది వేయాలి.

 

అలా కొంత‌సేపు ఉన్నాక  దూదిని తీసి నొప్పి ఉన్న చెవిపై పెట్టి అందులో ఉండే మిశ్ర‌మాన్ని చెవిలో ప‌డేట్టుగా దూదిని పిండాలి. రెండు చుక్క‌లు చెవిలో ప‌డ‌గానే దూదిని తీసేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వెంట‌నే స‌మ‌స్య తీవ్ర‌త త‌గ్గుతుంది. వెల్లుల్లి ర‌సం, ఆలివ్ ఆయిల్‌ల‌లో యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. అందుకే ఈ రెండిటి కాంబినేష‌న్ చెవి ఇన్ఫెక్షన్ తగ్గించడంలో ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: