మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మనం చాలా సార్లు చూశాము మరి అదే మద్యంతో ఒకరి ప్రాణం కాపాడితే ఎలా ఉంటుంది అన్న విషయం మాత్రం ఇప్పటి వరకూ ఎవరు చూసి ఉండరు అస్సలు ఊహించి ఉండరు కూడా. ముల్లుని ముల్లుతోనే తీయాలి అనే సామెతను వియత్నాంకు చెందిన డాక్టర్లు బాగా నమ్మినట్టున్నారు. అలా ఎలా చేయాలో కూడా మనకి చేసి చూపించారు.

 

విషయానికి వస్తే ఫుల్లుగా తాగేసి ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వేళ అతని బతికించేందుకు వియత్నాం డాక్టర్లు ఊహించని విధంగా అతనికి వైద్యం చేశారు. బాటిళ్ళ బాటిళ్ళ బీర్లను లాగించేసిన గువన్ వాన్ సహత్ అనే వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో డాక్టర్ల వద్దకు వచ్చాడు. అయితే అతని శరీరంలో ప్రమాదకర స్థాయిలో మిథనాల్ చేరుకుంది. దీంతో ఏం చేయాలో పాలుపోని వైద్యులు చివరికి అతనికి వినూత్నంగా ట్రీట్మెంట్ ఇచ్చారు.

 

IHG

 

మిథనాల్ శాతం శరీరంలో ఎక్కువగా ఉండడం వల్ల అతను రకంగా ట్రీట్మెంట్ ఇచ్చినా బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా ఉండటంతో రిస్క్ అని తెలిసినా మరో మార్గం లేక వారు 15 కేన్ల బీరు ని అతని పొట్టలో నింపారు. దీంతో బీరు వల్ల విషతుల్యమైన అతని కడుపుని బీరు తోనే తీసేసేలా ప్లాన్ చేసిన వారు చివరికి అతని బ్రతికించడంతో సక్సెస్ అయ్యారు.

 

IHG

 

ఇంతకీ విషయం ఏమిటంటే బీరులో మిథనాల్ తో పాటు ఇథనాల్ కూడా కలిసి ఉంటుంది. దాని ద్వారా కడుపులో ఏర్పడే యాసిడ్ ను ఇథనాల్ నియంత్రిస్తుంది ప్రక్రియపై ఉన్న నమ్మకంతో డాక్టర్లు మొట్టమొదటిసారి ప్రయత్నం చేసి చివరికి విజయం సాధించారు. ఇంతేనా అని చెప్పి మందు తాగి ఆరోగ్యం చెడిపోతే మళ్ళీ మీరే కోలుకునేందుకు మందు తాగకండి బాబోయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: