ఈ మధ్య కాలంలో కాలుష్యం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల చిన్నవయస్సులోనే తెల్లజుట్టు సమస్యతో ఇబ్బందులు పడేవారి సంఖ్య పెరిగిపోతుంది. వయస్సు తక్కువ ఉన్నా తెల్లజుట్టు రావడంతో కొందరు హెయిర్ డై లను ఉపయోగిస్తున్నారు. అందులో ఉండే ప్రమాదకరమైన రసాయనాల వల్ల లేని జబ్బులు తెచ్చుకుంటున్నారు. హెయిర్ డైల వల్ల తాత్కాలిక ఫలితం ఉన్నా దాని వల్ల భవిష్యత్తులో కలిగే నష్టాలు ఎక్కువ. 
 
కెమికల్స్ తో కూడిన డై లను ఉపయోగించే బదులు ఉసిరి, హెన్నా పొడులు వాడితే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరి పొడిలో కొద్దిగా నిమ్మరసం వేసి మాడు మీద రాస్తే తెల్ల జుట్టు సమస్య క్రమంగా దూరమవుతుంది. ఉల్లిపాయల పేస్టును మాడుకు పట్టించి పూర్తిగా ఆరిపోయే వరకు ఉంచి తలస్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కొబ్బరి నూనెలో నిమ్మరసం పోసి మాడుకు రాసుకుంటే శిరోజాలు అందంగా, కాంతివంతంగా కనిపిస్తాయి. 
 
తెల్ల వెంట్రుకలు ఉన్నవారు ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ తాగినా మంచి ఫలితాలు ఉంటాయి. నువ్వులను మెత్తగా చేసి అందులో బాదం ఆయిల్ వేసి మాడుకు రాస్తే జుట్టు నల్లగా మారుతుంది. ఈ వంటింటి చిట్కాలను పాటించినా తెల్ల వెంట్రుకల సమస్య తగ్గకపోతే వైద్యులను సంప్రదించి మందులు వాడి తెల్లజుట్టు సమస్య నుండి బయటపడవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: