ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరయా అంటే కంటినిండా నిద్రపోయేవాళ్లే. ఆహారం, నీరు మనిషికి ఎంత ఆవశ్యమో.. నిద్ర కూడా అంతే అవసరం. నిద్ర ద్వారానే శరీరానికి కొత్త ఉత్సాహం పొందుతుంది. రోజుకు 8 గంటల పాటు నిద్రించకుంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే నిత్యం ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది చాలా ప‌నులు చేస్తారు. ముఖ్యంగా తెలిసి తెలియ‌ని ఎన్నో త‌ప్పులు చేస్తుంటారు. కానీ, ఒక్కోసారి అవే మ‌న ఆరోగ్యంపై చెడు ప్ర‌భావం చూపుతుంది. మ‌రి అవేంటో ఓ లుక్కేసి.. మ‌ళ్లీ ఆ త‌ప్పులు జ‌ర‌గ‌కుండా చూసుకోండి.

 

చాలామంది చీకట్లో పడుకోవడానికి ఇష్ట పడ్తారు.నిద్ర లేచేప్పుడు కూడా అదే చీకటి గదిలోనే మేల్కొంటారు.దీనివల్ల ఇంకా నిద్రొస్తున్నట్లుగా ఉండడమే కాదు,మెదడు అంతా గందరగోళంగా ఉంటుంది. కాబట్టి నిద్ర లేచే సమాయానికి కర్టెన్స్ తీసి ఉంచాలి. అప్పుడు బ‌య‌ట వెలుతురు లోప‌లికి వ‌స్తుంది. అలాగే చాలా మందికి బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ, మనశరీరం ఉదయం 8 నుండి 9మద్య కార్టసోల్ అని పిలవబడే ఎనర్జీ రెగ్యులేటింగ్ హార్మోన్ ను విడుదల చేస్తుంది.

 

కాఫీ తాగడం వల్ల ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది,దాంతో మనకు శక్తి తక్కువగా ఉంటుంది. అదేవిధంగా,  ఖాళీ క‌డుపుతో కాఫీ తాగితే గ్యాస్‌, అసిడిటీ స‌మ‌స్య‌లు పెరుగుతాయి. పొద్దునే లేవాలని అలారం పెడతాం కానీ అది మోగుతూంటే ఆఫ్ చేసి పడుకుంటాం. అలా పడుకోవడం వల్ల మన నిద్ర కంప్లీట్ అవ్వదు సరికదా దాని వల్ల నిద్ర లేచాక సోమరితనం, అలసట కలుగుతాయి. మ‌రియు చాలా మంది ఉద‌యాన్నే వేడి నీటి స్నానం చేస్తారు. కానీ అలా చేయ‌కూడ‌దు. ఎందుకంటే వేడి నీరు శ‌రీరానికి రిలాక్సేష‌న్ ఇస్తుంది. దీంతో ఆఫీస్‌లో చురుగ్గా ఉండ‌లేరు. క‌నుక ఉద‌యం వేడి నీటి స్నానం క‌న్నా.. చ‌న్నీళ్లు చేస్తేనే మంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: