పైల్స్ లేదా హెమరాయిడ్స్ అనేది ప్రస్తుత కాలంలో సర్వసాధరణమైన అనారోగ్యపు సమస్యగా మారింది. అందుకు కారణం ప్రస్తుతం మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు వల్ల అనేక రకాలైన అనారోగ్యాల భారీన పడుతున్నారు.  కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవారు ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతుంటారు. అలాగే ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, మలబద్ధకం వంటి వాటితో మొలలు వస్తుంటాయి.

 

అయితే ఏ కార‌ణం వ‌ల్ల పైల్స్ వ‌చ్చినా అవి ఓ ప‌ట్టాన మాన‌వు. ఈ క్ర‌మంలోనే కొన్ని సింపుల్‌ టిప్స్ పాటిస్తే పైల్స్ చెక్ పెట్ట‌వ‌చ్చు. పైల్స్ కు డీహైడ్రేషన్ కూడా ఒక ప్రధానకారణం. అందువల్ల అల్లం, నిమ్మరసం, తేనె కలిపిన జ్యూస్ ను ప్రతి రోజూ రెండు సార్లు తాగాలి. దీంతో వాటి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌బిస్తుంది. అలాగే కొద్దిగా జీలకర్ర తీసుకొని రోస్ట్ చేయలి. తర్వాత రోస్ట్ చేయని జీలకర్రను ఒక టేబుల్ స్పూన్ తీసుకొని, ఈ రెండింటిని మిక్స్, చేసి పౌడర్ చేయాలి.

 

ఇలా మెత్తగా తయారు చేసుకొన్న పౌడర్ ను ప్రతి రోజు ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకొని తాగాలి. ఈ రెమిడీ కూడా మంచి ఫ‌లితాన్ని అందిస్తుంది. అదేవిధంగా, సోయా బీన్స్, బ్లాక్ బీన్స్, పీచు అధికంగా ఉండే కాయ ధాన్యాలు పైల్స్ రోగులకు మంచివి. పైల్స్, మలంలో రక్తం పడటం వంటి సమస్యలను నివారించడానికి పచ్చి ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయను తినడం లేదా జ్యూస్ తాగడం వల్ల రక్తం పడటాన్ని తగ్గించి అనల్ పెయిన్ ను తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: