ఉసిరికాయ‌లు.. తెలియ‌ని వారుండ‌రు. ఆమ్లా, దీన్నే ఇండియన్ గ్రూస్బెర్రీ అని కూడా పిలుస్తారు. ఉసిరికాయలో పోషకాలు అత్యధికంగా ఉంటాయి. ఉసిరికాయలో ఉన్న ఔషధ గుణాల వలన దీనిని ఆయుర్వేద రత్నమని పిలుస్తారు. ఇది అల్సర్లు, దగ్గు, మధుమేహం, మలబద్దకం, కొలెస్ట్రాల్ లతో పోరాడుతుంది. ఉసిరికాయలో పోషకాలు మెండుగా ఉంటాయి. అయితే ఉసిరికాయ‌ల‌ను తేనెతో క‌లిపి తీసుకుంటే మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు.

 

అందుకు ముందుగా ఒక జార్ తీసుకుని అందులో సగం వరకు తేనెతో నింపాలి. దాంట్లో బాగా కడిగి నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను వేయాలి. అనంతరం మూత బిగించి పక్కకు పెట్టాలి. కొద్ది రోజులకు ఉసిరికాయలు పండ్ల జామ్‌లా మారుతాయి. అనంతరం వాటిని తీసి రోజుకొకటి చొప్పున పరగడుపున తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్త మెరుగుప‌డుతుంది. మ‌రియు గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. అలాగే తేనె, ఉసిరి మిశ్రమం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది.

 

దీని వల్ల అధికంగా ఉన్న బరువు తగ్గుతారు. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే స్త్రీలలో రుతు సంబంధ సమస్యలు తగ్గుతాయి. దీని వల్ల రుతుక్రమం సరిగ్గా అవుతుంది. పిల్లలు కలిగేందుకు అవకాశాలు కూడా పెరుగుతాయి. అదే మగవారిలో అయితే వీర్య నాణ్యత పెరుగుతుంది. అదేవిధంగా, ఈ మిశ్ర‌మం క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకుంటే  లివర్ సమస్యలన్నీ దూరమవుతాయి. లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: