దందాల నొప్పి మనందరకి వచ్చే సర్వసాధారణ సమస్య. దంతాలు పుచ్చిపోవడం, ఇన్ఫెక్షన్, కొత్తగా దంతాలు రావడం, దంతాల్లో పగుళ్లు రావడం, చిగుళ్ల వ్యాధులు తదితర కారణాల వల్ల దంతాల‌ నొప్పి వస్తుంది. అకస్మాత్తుగా వచ్చే పంటి నొప్పితో ఎంతటి వారైనా విలవిల్లాడిపోతారు. ఎక్కువగా రాత్రుళ్లు మొదలయ్యే పంటినొప్పి కొన్ని గంటల పాటు తీవ్రవేదనకు గురిచేస్తుంది. పంటి నొప్పి అనేది సాధారణంగా కనిపించినా రోజు వారి పనులకు ఆటంకం కలిగిస్తుంది.

 

అయితే పంటి నొప్పి నివారణకు ఇంట్లో చేసే పరిష్కారాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ఉత్తమమైన పరిష్కార మార్గాలు ఇప్పుడు తెలుసుకొందాం. ఉల్లిపాయ‌ల‌తో వంట‌లే కాదు దంతాల నొప్పిని కూడా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు ముందుగా ఉల్లిగ‌డ్డ‌ను తీసుకుని అడ్డంగా చ‌క్రాల్లా కోయాలి. అందులో నుంచి ఒక చ‌క్రాన్ని తీసి నొప్పి పుడుతున్న దంతం మీద కొంచెం సేపు ఉంచాలి. దీంతో ప‌ట్టి నొప్పి సులువుగా త‌గ్గుతుంది. వెల్లుల్లి, లవంగంలను తీసుకొని దానిని పేస్ట్ చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో పెడితే దాని నుండి వచ్చే రసం వల్ల పది సెకన్లలోనే నొప్పి తగ్గుతుంది.

 

ఉల్లిపాయ‌ల్లాగే కీర‌దోస ముక్క‌ల‌ను కూడా అడ్డంగా కోసి వాటిని దంతాల‌పై ఉంచాలి. దీంతో ప‌ట్టి నొప్పి సులువుగా త‌గ్గుతుంది. అదేవిధంగా, వేడి వేడిగా ఉన్న ఓ టీ బ్యాగ్‌ను నొప్పి పుడుతున్న దంతాల‌పై ఉంచాలి. అందులో ఉండే ప‌లు ర‌సాయ‌నాలు దంతాల నొప్పిని త‌గ్గిస్తాయి. చిగుళ్లను హాయి ప‌రుస్తాయి. మ‌రియు మీ చిగుళ్ళ మీద మిరియాల పొడితో రుద్దడం వల్ల వెంటనే ఆ ప్రాంతం తిమిరిగా ఉండి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: