భోజనం ప్రతి మనిషికీ ఒక ప్రాథమిక అవసరం. రాజులా అల్పాహారాన్ని, యువరాజులా భోజనాన్ని చేయాలి, కానీ రాత్రి భోజనాన్ని మాత్రం ఒక బంటులా స్వీకరించాలి అనే సామెత గురించి మనందరికీ తెలుసు. ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది ప‌క్క‌న పెడితే.. ఆరోగ్యంగా ఉండాలంటే మీ రాత్రి భోజ‌నంలో కొన్ని ఆహార ప‌దార్థాల‌ను ఖ‌చ్చితంగా చేర్చుకోవాలి. రాత్రి పూట ఆహారంలో పెరుగుకు బ‌దులుగా మ‌జ్జిగ‌ను తీసుకోవాలి. 

 

అదేవిధంగా అన్నంకు బ‌దులుగా చ‌పాతీల‌ను తినాలి. అవి కూడా త‌గ్గించి తినాలి. లేదంటే జీర్ణం ఆల‌స్య‌మై గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మ‌రియు ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌ల‌ను రాత్రి పూట ఎక్కువగా తినాలి. ఇవి జీర్ణ ప్రక్రియ‌ను మెరుగు ప‌రుస్తాయి. వీటితోపాటు అల్లం వంటి ప‌దార్థాల‌ను క‌లుపుకుని తింటే దాంతో శ‌రీరానికి రాత్రి పూట కావ‌ల్సిన వేడి అందుతుంది. రాత్రిపూట జంక్ ఫుడ్‌, నూనె ప‌దార్థాలు, ఫ్రాజెన్ ఫుడ్‌, మాంసాహారం, బాగా కొవ్వు ఉన్న ప‌దార్థాల‌కు దూరంగా ఉంటేనే మంచిది. 

 

అదేవిధంగా, రాత్రి పూట వీలైనంత వ‌ర‌కు ఉప్పును త‌గ్గించ‌డ‌మో.. లేదంటే మానేయ‌డ‌మో చేయాలి. ఎందుకంటే ఉప్పు ఉన్న ప‌దార్థాల‌ను రాత్రి పూట ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోకి నీరు ఎక్కువ‌గా వ‌స్తుంది. రాత్రి పూట భోజనం చేసిన వెంటనే పండ్లను తినడం చాలా మందికి అలవాటు. అయితే అలా చేయకూడదు. ఎందుకంటే రాత్రి పూట డిన్నర్ తరువాత పండ్లను తింటే దాంతో పొట్ట ఉబ్బరంగా తయారవుతుంది. అలాంటి స‌మ‌యంలో ఎన్నో ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: