ఈ మధ్య కాలంలో చిన్నాపెద్దా అని తేడా లేకుండా అందరినీ కంటి సమస్యలు వేధిస్తున్నాయి. సరైన పోషకాహారం లేకపోవడం, అధిక ఒత్తిడి, వయస్సు పై బడటం ఇతర కారణాల వల్ల కంటి సమస్యలు వస్తాయి. కొన్ని చిట్కాలను పాటిస్తే కంటి సమస్యలను తగ్గించుకొని కంటి చూపును మెరుగుపరచుకోవచ్చు. పచ్చ కర్పూరం, గంధం కలిపి దానిని తమలపాకులో కలిపి వేసుకుంటే కంటి చూపు మెరుగవుతుంది. 


 
ప్రతిరోజు కొన్ని కరివేపాకులను తింటే అందులో ఉండే ఏ విటమిన్ వల్ల మానసిక ఒత్తిడి దూరమై కంటికి మేలు చేకూరుతుంది. పొన్నగంటి ఆకు రసంలో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసి చల్లారిన తర్వాత త్రాగితే మంచి ఫలితాలు ఉంటాయి. టమాటా, క్యారట్, గుడ్లు, చేపలు, నట్స్, గ్రీన్ లీఫ్ కంటి చూపును మెరుగుపరుస్తాయి. కంప్యూటర్ ఎక్కువగా వినియోగించేవారు వీలును బట్టి మూడు నాలుగు సెకన్ల పాటు కళ్లు తెరుస్తూ మూస్తూ వ్యాయామం చేయడం మంచిది. 

 

ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొంత సమయం సూర్యరశ్మిలో ఉంటే బిగుతైన నాడీ కండరాలు పట్టు కోల్పోయి కళ్లు మరియు కంటిపాపలు మెరుగుపడతాయి. కళ్లు ఒత్తిడిగా ఉన్నాయని భావిస్తే నీళ్లతో కళ్లను కడగాలి. నీళ్లతో కళ్లు కడిగితే కళ్లు ఉపశమనం పొంది తాజాగా ఉంటాయి. ఆప్రికాట్లు, బ్లూ బెర్రీలు కంటిచూపు మెరుగుపరచటంలో సహాయపడతాయి. వీటిలో ఉండే బీటా కెరాటిన్ కంటికి మేలు చేకూరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: